Movies

టిల్లూకి పిల్ల దొరికింది

టిల్లూకి పిల్ల దొరికింది

సిద్దు జొన్నలగడ్డ కథానాయకుడిగా నటించిన ‘డీజే టిల్లు’ ఘన విజయాన్ని అందుకొన్న సంగతి తెలిసిందే. నేహా శెట్టి కథానాయికగా నటించింది. ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్‌ వస్తోంది. సిద్దునే హీరో. కాకపోతే… ఈ సీక్వెల్‌లో కొన్ని మార్పులు చోటు చేసుకొన్నాయి. ఈ సీక్వెల్‌లో నేహాకి ఛాన్స్‌ దొరకలేదు. ఆమె స్థానంలో అనుపమ పరమేశ్వరన్‌ వచ్చి చేరింది. ఇటీవల చిత్రబృందం అనుపమని సంప్రదించినట్టు, ఈ సినిమా చేయడానికి తను అంగీకారం తెలిపినట్టు సమాచారం అందుతోంది. నేహా ఓ అతిథి పాత్రలో కనిపించే అవకాశాలున్నాయి. డీజే టిల్లుని రూపొందించిన విమల్‌ కృష్ణ ఇది వరకే ఈ  ప్రాజెక్టు నుంచి తప్పుకొన్నారు. ఆయన స్థానంలో మల్లిక్‌ దర్శకత్వం వహిస్తారని సమాచారం అందుతోంది. తేజా సజ్జా కథానాయకుడిగా నటించిన ‘అద్భుతం’ చిత్రాన్ని రూపొందించింది మల్లిక్‌నే. ఇప్పుడు ఆయనకు మరో అవకాశం దక్కినట్టైంది. ‘డీజే టిల్లు 2’ షూటింగ్‌ మొత్తం విదేశాల్లోనే జరగబోతోందని టాక్‌. ప్రస్తుతం స్ర్కిప్టు వర్క్‌ జరుగుతోంది. త్వరలోనే షూటింగ్‌ ప్రారంభిస్తారు.