Movies

ఆ సంఘటనను జీవితాంతం మర్చిపోలేను

ఆ సంఘటనను జీవితాంతం మర్చిపోలేను

సినిమాలతో రాని గుర్తింపు.. బిగ్‌ బాస్‌ ద్వారా తెచ్చుకుంది తేజస్వి మదివాడ. బిగ్‌బాస్‌ ఓటీటీలో కూడా కంటెస్టెంట్‌గా చేసింది. ప్రస్తుతం కమిట్‌మెంట్‌ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ క్రమంలో మూవీ ప్రమోషన్‌ సందర్భంగా తేజస్వి సంచలన వ్యాఖ్యలు చేసింది. సినీ పరిశ్రమనే కాదు.. ప్రతి చోట క్యాస్టింగ్‌ కౌచ్‌ ఉందని.. కానీ ఇండస్ట్రీకి సంబంధించిన వారే ఎక్కువ ఫోకస్‌ అవుతున్నారని తెలిపింది. అలానే ఇండస్ట్రీలో తనకు ఎదురైన ఓ చేదు అనుభవం గురించి వెల్లడించింది. ఓ సారి సుమారు 30 మంది తాగొచ్చి తనను ఎటాక్‌ చేశారని.. ఆ సమయంలో ఎంతో బాధపడ్డానని చెప్పుకొచ్చింది తేజస్వి. ఆమె చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఆ వివరాలు..
తేజస్వి మాట్లాడుతూ.. ‘‘ఓ సారి ఓ ఈవెంట్‌కు వెళ్లినప్పుడు సుమారు 30 మంది ఫుల్‌గా తాగొచ్చి.. రాత్రి నాపై అటాక్‌ చేశారు. ఆ రోజు నేను ఏదోలా తప్పించుకుని ఇంటికి తిరిగి చేరుకోగలిగాను. భయంతో రాత్రంతా ఏడ్చాను. ఆ సంఘటనను జీవితాంతం మర్చిపోలేను’’ అంటూ చెప్పుకొచ్చింది.‘‘అలానే ఇండస్ట్రీలో చాలా మంది నన్ను కమిట్‌మెంట్‌ అడిగారు. కొందరు ఫోన్‌ చేసి అడిగితే.. మరి కొందరు నేరుగా చూపులతోనే ఆ భావాన్ని ప్రకటించేవారు. అది ఈజీగా అర్థం అవుతుంది. సినీ ఇండస్ట్రీనే కాదు.. ప్రతి రంగంలోనూ క్యాస్టింగ్‌ కౌచ్‌ ఉంటుంది. అలానే ఇది ఎప్పటి నుంచో ఉందో. కానీ అప్పుడు సోషల్‌ మీడియా లేదు కాబట్టి.. ఇంతలా వెలుగులోకి రాలేదు. ఇప్పుడు సోషల్‌ మీడియా వాడకం ఎక్కువగా ఉంది.. కనుక ఏం జరిగినా వెంటనే తెలిసిపోతుంది. ఎవరికి భయపడాల్సిన పని లేకుండా వెల్లడించవచ్చు’’ అని తెలిపింది. తేజస్వి వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్‌ రూపంలో తెలియజేయండి.