దేశంలోని 11 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో పురుషుల కంటే కూడా మహిళలకు ఎక్కువ మంది లైంగిక భాగస్వాములున్నట్లు జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్) 2019 – 2021 నివేదిక తెలిపింది.రాజస్థాన్, హర్యానా, చండీగఢ్, జమ్ము, కశ్మీర్, లద్దాఖ్, మధ్యప్రదేశ్, అస్సాం, కేరళ, లక్షద్వీప్, పుదుచ్చేరి, తమిళనాడులో మహిళలకు అక్కడి పురుషులతో పోల్చితే ఎక్కువ మంది లైంగిక భాగస్వాములున్నట్లు నివేదిక తెలిపింది.ఎక్కువ మంది లైంగికభాగస్వాములు ఉన్న మహిళలు రాజస్థాన్‌లో ఎక్కువగా ఉన్నారు.అక్కడ మహిళలకు సగటున 3.1 మంది లైంగిక భాగస్వాములు ఉండగా పురుషులకు 1.8 మంది భాగస్వాములున్నారు.నగరాల్లో మహిళలు, పెళ్లి కానివారు, విడాకులు తీసుకున్నవారు, వితంతువుల కంటే… గ్రామీణ ప్రాంతాల్లో వివాహిత మహిళలు ఇద్దరి కంటే ఎక్కువ మందితో సెక్స్‌లో పాల్గొన్నట్లు సర్వేలో తెలిపారు.ఈ సర్వేను దేశంలో 707 జిల్లాల్లో 1.1 లక్షల మంది మహిళలు, లక్ష మందిపురుషులతో నిర్వహించారు.