సింగపూర్ స్వర లయ ఆర్ట్స్ సంస్థ ఆధ్వర్యంలో శ్రీగురు కళాంజలి కార్యక్రమ మొదటిభాగాన్ని నిర్వహించారు. స్వర లయ ఆర్ట్స్ విద్యార్థులు బొమ్మకంటి అనన్య, షణ్మిత తంగప్పన్లు ప్రార్ధనాగీతంతో సభ ప్రారంభమయింది.
పప్పు పద్మా రవిశంకర్ వీణానాదం, పప్పు జ్ఞానదేవ్ వయోలిన్, పప్పు జయదేవ్ మృదంగ సంగీతఝరి అలరించింది. సంస్థ అధ్యక్షురాలు యడవల్లి శేషు కుమారి గురు పరంపరపై ప్రసంగించారు. గురువుల కళావిశిష్టత, వైవిధ్యం మున్నగు అంశాలపై చర్చలతో విజ్ఞానవంతముగా ముందు తరాలకు ఉపయుక్తంగా రూపొందించబడినదని, ఈ శీర్షికలో సమర్పించనున్న కార్యక్రమాలలో ఇది మొదటి భాగమని పేర్కొన్నారు.
ప్రత్యేక అతిధిగా గుమ్ములూరి శారద సుబ్రహ్మణ్యం బొమ్మకంటి సౌజన్య, కవుటూరు లలితా రత్నకుమార్, సౌభాగ్య లక్ష్మీ రాజశేఖర్, విద్యాధరి, రాధిక నడదూరు తదితరులు పాల్గొన్నారు.
సింగపూర్‌లో “శ్రీ గురు కళాంజలి”
Related tags :