మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వేడుకలు అట్టహాసంగా హైదరాబాద్‌లో చేస్తుంటే, బన్నీఅల్లు అర్జున్ అమెరికా వెళుతున్నట్లుగా వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే బన్నీ అమెరికా వెళ్లడానికి కారణం చిరంజీవి పుట్టినరోజు వేడుకను తప్పించుకోవడానికి కాదని, న్యూయార్క్ సిటీలో వున్న ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ అసోసియేషన్స్ నుండి ఆయనకు ఆహ్వానం వచ్చిందని.. అందుకే అందులో పార్టిసిపేట్ చేయడానికి వెళుతున్నాడని అతని టీమ్ చెబుతున్నారు. ఆగస్ట్ 21వ తేదీన న్యూయార్క్‌లోని మాన్ హట్టన్ దగ్గర భారత 75వ స్వతంత్ర దినోత్సవ సందర్భంగా.. ఆజాదీ కా అమృత్ మహోత్సవం జరుపుతున్నారు. ఈ ఉత్సవానికి రావాలని బన్నీకి ఆహ్వానం వచ్చింది. దీంతో బన్నీ న్యూయార్క్ బయలుదేరి వెళ్లారు. అంతే కానీ, అతను చిరంజీవి పుట్టినరోజు వేడుకలను తప్పించుకోవటానికి కాదని.. బన్నీ పర్సనల్ టీమ్ క్లారిటీ ఇచ్చింది. సరిగ్గా రెండు ఈవెంట్స్ ఒకే రోజు రావడంతో.. బన్నీ అమెరికా నుండి చిరు పుట్టినరోజు వేడుకకి రాలేడు కాబట్టి.. ఇది ఒక రకంగా అతనికి హెల్ప్ అయిందనే చెప్పాలి. ఎందుకంటే.. బన్నీ మరియు రామ్ చరణ్ అభిమానులు సోషల్ మీడియాలో తీవ్ర ఆరోపణలు చేసుకుంటున్న నేపథ్యంలో.. బన్నీ ఈ వేడుకకు హాజరు కాకపోవటమే మంచిదని.. కొందరు అనుకుంటుండటం విశేషం.