Movies

న్యూయార్క్‌లో అనుకోని ‘అతిథి’ తో బన్నీ

న్యూయార్క్‌లో అనుకోని ‘అతిథి’ తో బన్నీ

మెగా కాంపౌండ్ నుంచి వచ్చినా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించుకున్న నటుడు అల్లు అర్జున్ . కొత్త రకం కథలు, వైవిధ్యభరిత పాత్రలతో ప్రేక్షకులకు చేరువయ్యాడు. ‘సరైనోడు’, ‘అల వైకుంఠపురంలో’, ‘పుష్ప’ వంటి చిత్రాల్లో తనదైన మార్కు నటనతో ఆకట్టుకున్నాడు. న్యూయార్క్‌లో బన్నీ హాలీడేను ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ హాలీడేలో ఐకాన్ స్టార్ అనుకోని అతిథిని కలుసుకున్నాడు.

దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు తెరకెక్కించిన ‘గంగోత్రి’ తో ఇండస్ట్రీకి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు అల్లు అర్జున్. ఈ సినిమాలో అతిథి ఆగర్వాల్ హీరోయిన్‌గా నటించింది. బన్నీ 19ఏళ్ల తర్వాత న్యూయార్క్‌లో ఆమెను కలుసుకున్నాడు. అందుకు సంబంధించిన ఫొటోలను అతిథి ఆగర్వాల్ సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది. అలనాటి మధుర జ్ఞాపకాలను నెమరేసుకుంటూ ఆ పిక్‌కు క్యాప్షన్ ఇచ్చింది. ‘‘ప్రియమైన అల్లు అర్జున్. నా ఫస్ట్ కోస్టార్. బిగ్గెస్ట్ సూపర్‌స్టార్. గంగోత్రి రోజులు గుర్తుకు వస్తున్నాయి’’ అని అతిథి ఆగర్వాల్ పేర్కొంది. అతిథి తన కుటుంబంతో కలసి న్యూయార్క్‌లోనే నివాసముంటుంది. ఇక కెరీర్ విషయానికి వస్తే.. అల్లు అర్జున్ చివరగా ‘పుష్ప’ లో కనిపించాడు. లెక్కల మాస్టారు సుకుమార్ ఈ సినిమాను తెరకెక్కించాడు. రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించింది. పాన్ ఇండియాగా రూపొందిన ఈ మూవీ సంచలన విజయం సాధించడంతో ‘పుష్ప-2’ పై భారీ అంచనాలేర్పడ్డాయి. సెప్టెంబర్ రెండో వారం నుంచి ఈ మూవీ షూటింగ్ ను ప్రారంభించే అవకాశం ఉంది