NRI-NRT

సెయింట్ లూయిస్ ‌ప్రవాసులతో ధూళిపాళ్ల సమావేశం

సెయింట్ లూయిస్ ‌ప్రవాసులతో ధూళిపాళ్ల సమావేశం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కాపాడుకోవాలంటే తెలుగుదేశం అధికారంలోకి రావడం తప్పనిసరి అని తెలుగుదేశం సీనియర్ నేత దూళిపాళ్ల నరేంద్ర అన్నారు. ఏపీ భవిష్యత్తును కోరుకునే ప్రవాసాంధ్రులు ఈ విషయంలో టీడీపీకి మద్దతు తెలపాలని కోరారు. సెయింట్ లూయిస్‌లో జరిగిన టీడీపీ ఆత్మీయ సమావేశంలో దూళిపాళ్ల ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. శ్రీనివాస్ మంచికలపూడి ఈ సమావేశాన్ని సమన్వయపరిచారు. దూళిపాళ్ల నరేంద్ర లాంటి నాయకులు తెలుగుదేశం పార్టీకి, రాష్ట్రానికి ఎంతో అవసరమని ఈ సందర్భంగా శ్రీనివాస్ మంచికలపూడి అన్నారు. చంద్రబాబుకు తమ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు సహకారం అందిస్తామన్నారు. నాగశ్రీనివాస్ శిష్ట్లా వ్యాఖ్యతగా వ్యవహరించారు. దండమూడి రాజేంద్రప్రసాద్, దర్శి బాబ్జీ, రమేశ్ బెల్లం, కాజ రామారావు, బాబు దండమూడి తదితరులు నరేంద్రను సన్మానించారు. ఈ సమావేశం విజయవంతం కావడంలో సురేశ్ శ్రీరామినేని, సురేంద్రబాచిన, అప్పలనాయుడు గండి, గోపినాథ్ సోంపల్లి, శ్రీనివాస్ అట్లూరి, జగన్ వేజండ్ల, సురేంద్ర బైరపనేని, రామకృష్ణ వీరవల్లి, శివ జాస్తి, సందీప్ ముప్పవరపు, రాజశేఖర్ ఓలేటి, డా. సుధీర్ అట్లూరి, సందీప్ గంగవరపు, శివ జాస్తి, ప్రదీప్ గవిర్నేని తదితరులు కీలక పాత్ర పోషించారు.

TDP Leader Dhulipalla Narendra Meets With NRI TDP In St Louis USA
TDP Leader Dhulipalla Narendra Meets With NRI TDP In St Louis USA
TDP Leader Dhulipalla Narendra Meets With NRI TDP In St Louis USA