Movies

జేపీ నడ్డాతో నితిన్ రెడ్డి భేటీ

జేపీ నడ్డాతో నితిన్ రెడ్డి భేటీ

తెలంగాణలో అధికారమే లక్ష్యంగా అడుగులు వేస్తున్న భాజపా అగ్రనేతలు ఆ దిశగా కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే పలువురు నేతలు భాజపా తీర్థం పుచ్చుకున్నారు. తాజాగా.. సినీ హీరో నితిన్‌తో భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా భేటీ అయ్యారు. హనుమకొండలో బండి సంజయ్‌ ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో జేపీ నడ్డా పాల్గొన్నారు. సభ ముగిసిన తర్వాత శంషాబాద్‌ చేరుకుని నోవాటెల్‌ హోటల్‌లో నితిన్‌తో భేటీ అయ్యారు. ఇద్దరి మధ్య దాదాపు గంటసేపు చర్చలు జరిగాయి. ఈ భేటీకి గల కారణాలపై ఇంకా స్పష్టత రాలేదు. ఇటీవల మునుగోడు సభలో పాల్గొనేందుకు వచ్చిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా నోవాటెల్‌ హోటల్‌లో ప్రముఖ సినీహీరో ఎన్టీఆర్‌తో సమావేశమైన విషయం తెలిసిందే.