రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా సీపీఎస్ కొత్త స్కీమ్‌ను ఉద్యోగులు అర్థం చేసుకోవాలని మంత్రి బొత్స సత్యనారాయణ కోరారు. ఉద్యోగ సంఘాలకు వారి సమస్యలపై పోరాటం చేసే హక్కు ఉందని.. కానీ, సీఎం ఇంటి ముట్టడికి పిలుపునిస్తే చూస్తూ ఊరుకుంటారా? అని ప్రశ్నించారు. గత ఉద్యమాల్లో అరెస్టయిన ఉద్యోగులకే నోటీసులు ఇస్తున్నట్టు చెప్పారు. సీపీఎస్ రద్దు చేస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చామని తెలిపిన మంత్రి బొత్స.. సీపీఎస్‌తో ఇబ్బందులున్నాయి కనుకే కొత్త స్కీమ్‌ను ప్రతిపాదించామన్నారు. కొత్త స్కీమ్.. సీపీఎస్ కంటే బాగుంటుందన్నారు. ముఖ ఆధారిత హాజరును త్వరలో అన్ని శాఖల్లో అమలు చేస్తామని మంత్రి స్పష్టం చేశారు.
జగన్ ఇంటి మీదకి వస్తే చూస్తూ ఊరుకోవాలా?
Related tags :