వ్యాయామం చేయడమంటే మన పిడికెడు గుండెను చక్కగా ఉంచడమే..వ్యాయామం చేయడంలో ఎన్నో సందేహాలు చాలా మందికి వస్తుంటాయి. గుండె జబ్బులున్నప్పుడు, గుండెనొప్పి వచ్చిన తర్వాత చేయాలా..? వద్దా..? అనే అనుమానాలు వస్తుంటాయి. ఎక్కువ మంది ఎలాంటి శారీరక శ్రమ ఉండొద్దని భావిస్తారు. వీటిలోని నిజనిజాలెంటో కార్డియాలజిస్టు డాక్టర్ రమేష్ గూడపాటి వివరించారు. వ్యాయామం చేసిన వారికంటే చేయని వారికి ఎక్కువగా గుండెకు సంబంధించిన సమస్యలు వస్తాయి. ఎక్స్‌ర్‌సైజ్‌తో బరువు తగ్గడం, మధుమేహం, అధిక రక్తపోటును నియంత్రించడంతో పాటు శారీరకంగా దృఢంగా ఉంటారు. రోజుకు 30 నిమిషాలు, వారానికి 5 రోజులు వ్యాయామం చేయాలి. చిరు చెమటలు పడితే చాలు. విపరీతమైన ఎక్స్‌ర్‌సైజ్ చేయడంతో గుండె కొట్టుకునే దానిలో తేడా వస్తుంది. గుండెపోటు వచ్చినా వ్యాయామం చేయాలి. కాకపోతే తేలికపాటి అంశాలను చేయడం మేలు. కళ్లు తిరిగినా, గుండె ఎక్కువగా కొట్టుకోవడం, చెమటలు అధికంగా వస్తే వైద్యులను సంప్రదించాలి. 50 ఏళ్ల వ్యక్తికి 170 నిర్దేశిత హార్ట్‌రేటు ఉంటే మంచిది.
ఎలా సన్నద్ధం కావాలి…!
* రోజుకు 30 నిమిషాలు వ్యాయామం చేయాలి.
* మొదటి 5 నిమిషాలు వార్మ్‌అప్ చేయాలి. అంటే నెమ్మదిగా చేయాలన్న మాట
* చివరి 5 నిమిషాలు కూడా నెమ్మదిగా తగ్గించాలి.
* మధ్యలో తినడం కన్నా నీరు తాగడం మేలు చేస్తుంది.