NRI-NRT

వీసా: యూరప్‌కు 60, న్యూజీల్యాండ్‌కు 200 రోజుల ఎదురుచూపులు

వీసా: యూరప్‌కు 60, న్యూజీల్యాండ్‌కు 200 రోజుల ఎదురుచూపులు

ఇప్పుడు యూరప్‌ దేశాలకు వెళ్లాలంటే కనీసం నెల, రెండు నెలలు ఆగాల్సివస్తోంది. అమెరికాకు గరిష్ఠంగా 500, న్యూజిలాండ్‌కు 200 రోజులు పడుతోంది. ఫలితంగా సింగపూర్‌, మలేసియా, థాయ్‌లాండ్‌, వియత్నాం వైపు చూస్తున్నారు. అమెరికా, యూరప్‌లకు వెళ్లాలనుకునేవారు ప్రస్తుతానికి ఉత్తర, ఈశాన్య భారత్‌లోని పర్యాటక ప్రాంతాల వైపు దృష్టిసారిస్తున్నారు. విదేశాలతో పాటు దేశంలోని పర్యాటక ప్రాంతాలకు విమాన టికెట్ల ధరలు కొవిడ్‌ ముందుకంటే రెట్టింపు అయ్యాయని టూర్‌ ఆపరేటర్లు చెబుతున్నారు. హోటళ్లలో గదుల అద్దెలూ పెరిగాయి. కొవిడ్‌ సమయంలో వచ్చిన నష్టాల్ని పూడ్చుకోవడం ఒక కారణం అయితే.. పర్యాటకుల తాకిడి హఠాత్తుగా పెరగడమూ మరో కారణమని అంటున్నారు. బ్యాంకాక్‌కు గతంలో రానుపోను విమాన టికెట్లు 18-20వేలకు దొరికేవి. ఇప్పుడు 40వేల వరకు ఖర్చవుతోంది. సిక్కింకు విమాన టికెట్‌ రూ.4వేలకు దొరికేది. అదీ రెట్టింపైంది.