పురుషుల్లో ముక్కు సైజును బట్టే వారి జననాంగ పరిమాణం ఉంటుందని జపాన్ శాస్త్రవేత్తలు అంటున్నారు. అంటే.. పొడవాటి ముక్కు ఉన్న వ్యక్తుల పురుషాంగం కూడా అదే తీరుగా ఉంటుందన్న మాట. క్యోటో ప్రిఫెక్చురల్ వైద్య విశ్వవిద్యాలయం పరిశోధకులు చేసిన అధ్యయనం ప్రకారం.. పై రెండు శరీర భాగాల మధ్య ప్రత్యేకమైన సహ సంబంధం ఉంటుందని తేలింది. పురుష శరీర నిర్మాణ శాస్త్రానికి సంబంధించిన మెడికల్ జర్నల్లో ఈ అధ్యయనం ప్రచురితమైంది. ఇందులో తేలిన వివరాల మేరకు.. పొడవాటి ముక్కున్న వ్యక్తుల పురుషాంగం నిటారుగా ఉన్నపుడు కనీసం 5.3 ఇంచీల మేర ఉంటుంది. అదే చిన్న ముక్కున్న పురుషుల్లో 4.1 ఇంచీలు మాత్రమే ఉన్నట్టు పేర్కొన్నారు. ఇంతకూ వీరు తమ పరిశోధన ఎవరి మీద చేశారంటే.. 126 మంది పురుషుల మృతదేహాలను పరిశీలించారు. వారు మరణించిన మూడు రోజుల్లోపు ఈ అధ్యయనం జరిగింది. అచేతనావస్థలో ఉన్న శవాలు కావడంతో వాటి పురుషాంగాలను చేత్తో లాగి కొలతలు తీసుకొన్నారు. ఈ అంశంపై మరింత విస్తృతంగా పరిశోధనలు జరగాల్సిన అవసరం ఉందని జపాన్ శాస్త్రవేత్తలు అభిప్రాయపడ్డారు.
మగాళ్ల ముక్కు సైజు బట్టి పురుషాంగం సైజు అంచనా!
Related tags :