Devotional

అయోధ్య రామమందిరం నుండి శుభవార్త

అయోధ్య రామమందిరం నుండి శుభవార్త

అయోధ్యలో రామమందిర నిర్మాణ పనులు 40 శాతం పూర్తయినట్లు ‘శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు’ ప్రధాన కార్యదర్శి చంపత్‌ రాయ్‌ తెలిపారు. అడుగు భాగం పనులు దాదాపు 80 శాతం ముగిసినట్లు వెల్లడించారు. 2020 ఆగస్టు 5న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భూమిపూజ చేసి నిర్మాణ పనులను ప్రారంభించిన విషయం తెలిసిందే. రెండేళ్లు పూర్తయిన సందర్భంగా నిర్మాణ పురోగతి విషయాలను రాయ్‌.. వార్తాసంస్థ పీటీఐతో పంచుకున్నారు. డిసెంబర్‌ 2023 నుంచి భక్తుల దర్శనానికి అనుమతిస్తామని తెలిపారు.