ఇటీవల బర్మింగ్‌హామ్ కామన్వెల్త్ గేమ్స్‌లో పోటీపడ్డ భారత మహిళా డిస్కస్ త్రోయర్ నవ్‌జీత్ కౌర్ ధిల్లాన్ డోపింగ్ పరీక్షలో విఫలమైంది. గత నెలలో ప్రపంచ చాంపియన్‌షిప్ కంటే ముందు ఆమె నుంచి సేకరించిన శాంపిల్స్‌లో నిషేధిత ఉత్ప్రేరకాల ఆనవాళ్లు ఉన్నాయని అథ్లెటిక్స్ ఇంటెగ్రిటీ యూనిట్ (ఏఐయూ) శనివారం ప్రకటించింది. పంజాబ్‌కు చెందిన 27 ఏళ్ల నవ్‌జీత్ 2018 గోల్డ్‌కోస్ట్ కామన్వెల్త్ గేమ్స్‌లో కాంస్య పతకం నెగ్గింది. బర్మింగ్‌హామ్ గేమ్స్‌లో మాత్రం ఆమె ఎనిమిదో స్థానంలో నిలిచింది. గత జూన్‌లో చెన్నైలో జరిగిన ఇంటర్ స్టేట్ చాంపియన్‌షిప్‌లో, కజకిస్తాన్‌లో జరిగిన కొసనోవ్ స్మారక మీట్‌లో నవ్‌జీత్ స్వర్ణ పతకాలు సాధించింది. నవ్‌జీత్‌పై నాలుగేళ్ల నిషేధం విధించే అవకాశముంది.
డోపింగ్ పరీక్షల్లో దొరికిన భారత క్రీడాకారిణి
Related tags :