DailyDose

ఐస్ క్రీం ఆర్డర్ చేస్తే కండోమ్ డెలివరీ

ఐస్ క్రీం ఆర్డర్ చేస్తే కండోమ్ డెలివరీ

తమిళనాడు రాష్ట్రంలోని కోయంబత్తూరు జిల్లాకు చెందిన ఓ వ్యక్తి ఒక ప్రైవేట్ ఇంగ్లీష్ న్యూస్ మీడియాలో ఫోటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో శనివారం(ఆగస్టు 27) రాత్రి ఆన్‌లైన్‌ ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ నుంచి తన పిల్లల కోసం ఐస్ క్రీమ్, చిప్స్ ఆర్డర్ చేశాడు. అయితే తీరా ఆర్డర్‌ డెలివరీ అయ్యాకి.. పార్శిల్‌ ఓపెన్‌ చేసి అందులో ఉన్న వస్తువును చూసి ఖంగుతున్నాడు. ఐస్‌క్రీం, చిప్స్‌కు బదులు కండోమ్‌లు ఉన్నాయి. ఇది చూసి షాక్ తిన్న అతను దానిని ఫోటో తీసి తన ట్విటర్‌ అకౌంట్‌లో పోస్ట్ చేశాడు.