ఎమ్మెల్సీ కవిత మీద ఢిల్లీ ఎంపీ చేసిన ఆరోపణలను ఎన్నారైలమంతా తీవ్రంగా ఖండిస్తున్నామని టీఆర్ఎస్ ఎన్నారై సెల్ గ్లోబల్ కోఆర్డినేటర్ మహేశ్‌బిగాల పేర్కొన్నారు. తెలంగాణ భవన్‌లో ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రశాంతంగా ఉన్న తెలంగాణను అల్లకల్లోలం చేయాలని బీజేపీ దండయాత్ర చేస్తున్నదని మండిపడ్డారు. మునుగోడులో ప్రజలు టీఆర్ఎస్ వెంటే ఉంటారని, గులాబీ అభ్యర్థికే పట్టంగడతారని ధీమా వ్యక్తంచేశారు.
కవితపై ఆరోపణలను ఖండించిన బిగాల మహేష్
Related tags :