కాఫీ దిగ్గజ సంస్థ స్టార్‌బక్స్ ముఖ్య కార్యనిర్వహణాధికారి (సీఈఓ)గా భారత సంతతికి చెందిన లక్ష్మణ్ నరసింహన్ నియమితులయ్యారు. ప్రస్తుతం బ్రిటన్ సంస్థ రెకిట్ సీఈఓగా ఉన్న నరసింహన్(55), ఆ బాధ్యతల నుంచి ఈనెల 30న వైదొలగనున్నారు. రెకిట్‌కు సీఈఓగా పనిచేసిన తొలి విదేశీయుడు కూడా ఈయనే. అమెరికాలోని సియాటెల్‌లో అక్టోబరు 1న స్టార్‌బక్స్‌కు సీఈఓ(ఇన్‌కమింగ్)గా నరసింహన్ చేరనున్నారు. సంస్థ తాత్కాలిక సీఈఓ హోవర్డ్ షాల్జ్‌తో కలిసి పనిచేస్తారు. 2023 ఏప్రిల్ 1న పూర్తి స్థాయిలో స్టార్‌బక్స్ నాయకత్వ బాధ్యతలను చేపట్టడంతో పాటు బోర్డులో చేరతారు.
స్టార్‌బక్స్ CEO కూడా మనోడే
Related tags :