వరుస పరాజయాలు ఎదురవుతున్న సమయంలో బాలీవుడ్‌కు మంచి విజయాన్ని అందించిన సినిమా ‘గంగూభాయ్ కథియావాడి’. ఆలియా భట్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా మరో ఘనతను దక్కించుకునే అవకాశాలు ఉన్నాయి. దిగ్గజ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ రూపొందించిన ఈ సినిమా మన దేశం నుంచి ఆస్కార్ ఎంట్రీగా వెళ్లనుందని సమాచారం. గతంలో షారుఖ్ ఖాన్ హీరోగా భన్సాలీ రూపొందించిన ‘దేవదాస్’ సినిమా కూడా ఆస్కార్‌కు మన దేశం నుంచి అఫీషియల్ ఎంట్రీగా వెళ్లింది. రచయిత హుస్సేన్ జైదీ రాసిన ‘మాఫియా క్వీన్స్ ఆఫ్ ముంబై’ పుస్తకం నుంచి కొన్ని ఘట్టాలను సేకరించి ‘గంగూభాయ్ కథియావాడి’ సినిమాను తెరకెక్కించారు భన్సాలీ. 1960లో వేశ్య వృత్తి సాగిస్తూ మాఫియా లీడర్లతో సంబంధాలు పెంచుకుని తనదైన నేర సామ్రాజ్యాన్ని సాగించిన గంగుభాయ్ జీవిత కథను ఈ సినిమాకు ఆధారంగా తీసుకున్నారు గంగూభాయ్ పాత్రలో ఆలియా భట్ నటన ప్రేక్షకులను ఆకట్టుకుంది. బెర్లిన్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్‌లోనూ ప్రశంసలు దక్కించుకుంది. గంగూభాయ్‌తో పాటు తెలుగు పాన్ ఇండియా మూవీ ‘ఆర్‌ఆర్‌ఆర్’ కూడా ఆస్కార్‌కు మనదేశం నుంచి ఎంట్రీ దొరికే వీలుందని విశ్లేషకులు భావిస్తున్నారు