ఇటీవల ‘సీతా రామం’ చిత్రంతో తెలుగు ప్రేక్షకుల ముందుకొచ్చింది బాలీవుడ్ నటి మృణాల్ ఠాకూర్. సీత పాత్రలో ఆకట్టుకునేలా నటించి ఇక్కడ మంచి గుర్తింపు సంపాదించుకుంది. టాలీవుడ్‌లో ఆమెకు మరిన్ని క్రేజీ ప్రాజెక్టులు దక్కేలా ఉన్నాయి. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తాను నాయికగా ఎలా మారిందో వివరించింది. మృణాల్ మాట్లాడుతూ…‘నేను డెంటిస్ట్ కోర్స్ చేశాను. ఎంట్రన్స్‌లో మంచి మార్కులు వచ్చాయి. అయితే నా మనసులో నటి కావాలని ఉండేది. అందుకు అమ్మానాన్న ఒప్పుకోలేదు. ఒక రోజు వాళ్లకు ఆమిర్ ఖాన్ ‘త్రీ ఇడియట్స్’ సినిమా చూపించా. అందులో తమ కలను సాకారం చేసుకునేందుకు ఎలా ప్రయత్నించారో తెలుసుకున్నారు. ఆ సినిమా చూశాక నన్ను సినిమాల్లో ప్రయత్నించమని అమ్మా నాన్న ప్రోత్సహించారు’ అని తెలిపింది.