సోషల్ మీడియాలో అనసూయకు, నెటిజన్లకు మధ్య వార్ నడుస్తున్నది. ఓ హీరోను ఉద్దేశించి ఆమె చేసిన ట్వీట్ వివాదం రేపింది. సదరు హీరో అభిమానులు అనసూయను ట్రోల్ చేస్తున్నారు. తాజాగా ఈ వ్యవహారంలో తలదూర్చింది నటి శ్రద్ధా దాస్. ‘అనసూయ అందగత్తె, ఆమె తనకన్నా సగం వయసున్న వారి కంటే ఆకర్షణీయంగా కనిపిస్తుంది’ అని ట్వీట్ చేసింది. దీంతో అనసూయను ట్రోల్ చేస్తున్న వారంతా శ్రద్ధా దాస్ మీద పడ్డారు. ‘ఆమెకు తోడు నువ్వూ వచ్చావా, అటెన్షన్ కోసమే ఇదంతా చేస్తున్నావు’ అంటూ ట్రోలింగ్ చేస్తున్నారు. సెటైరికల్ మీమ్స్ కామెంట్స్‌గా పోస్ట్ చేస్తున్నారు. ఈ ట్రోలర్స్‌పై శ్రద్ధా దాస్ స్పందిస్తూ…‘అనసూయ అందంగా ఉందని ప్రశంసించినందుకు నన్ను ట్రోల్ చేయడం సరికాదు. ఇలా విమర్శలు చేస్తూ మీ సమయం వృథా చేసుకుంటున్నారు. నేను మిమ్మల్ని బ్లాక్ చేసి, మీ కామెంట్స్ డిలీట్ చేస్తా. నేను ఎవరి పక్షాన నిలవడం లేదు. ఈ వివాదంలో స్పందించేందుకు అసలు నేనెవర్ని? సోషల్ మీడియాలో ఒకరి మీద విమర్శలతో దాడి చేయడం సరికాదని చెప్పాలని ప్రయత్నించా’ అని పేర్కొంది