NRI-NRT

విదేశీ అపరకుబేరులను దేశంలోకి ఆకర్షించేందుకు థాయ్‌ల్యాండ్ ప్రయత్నం

విదేశీ అపరకుబేరులను దేశంలోకి ఆకర్షించేందుకు థాయ్‌ల్యాండ్ ప్రయత్నం

దేశంలో టూరిజాన్ని మళ్లీ పట్టాలెక్కించేందుకు థాయ్‌ల్యాండ్ ప్రభుత్వం విశ్వప్రయత్నం చేస్తోంది. అయితే.. ఇతర దేశాలను అనుసరిస్తూ విదేశీ అపరకుబేరులకు ఆహ్వానం పలికేందుకు ఉత్సుకత ప్రదర్శిస్తోంది. టూరిజంతో పాటూ స్థానిక ఆర్థిక వ్యవస్థకు లాభం చేకూర్చే దిశగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. పదేళ్ల కాలపరిమితి గల వీసాతో అపరకుబేరులకు థాయ్‌ల్యాండ్ రెడ్ కార్పెట్ పరుస్తోంది. ఈ కొత్త విసాను ప్రభుత్వం ఏడాది క్రితమే ప్రకటించినా కానీ.. బుధవారం అధికారికంగా ప్రారంభించింది. తమ తమ రంగాల్లో అత్యంత నిష్ణాతులు, హైనెట్ వర్త్ ఇండివిడ్యువల్స్‌ మాత్రమే ఈ వీసాకు అర్హులు. సింగపూర్, యూనైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఇప్పటికే ఈ తరహా వీసాలు ప్రవేశపెట్టాయి. ప్రస్తుతం థాయ్‌ల్యాండ్ జీడీపీలో(GDP) పర్యాటకం వాటా 12 శాతంగా ఉంది. తాజా వీసా పర్యాటం వాటా మరో 3 శాతం పెరగచ్చని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఈ వీసాతో థాయ్‌ల్యాండ్‌కు వచ్చే వారి వల్ల దేశంలో 27 బిలియన్ డాలర్ల విలువైన ఆర్థికకార్యకలాపాలు జరుగుతాయని నిపుణుల చెబుతున్నారు. అంతేకాకుండా.. ఎలక్ట్రిక్ వాహనాలు, స్మార్ట్, డిజిటల్ ఎటక్ట్రానిక్స్ వంటి ఆధునిక రంగాలకు చెందిని నిపుణులతో దేశంలో టెక్నాలజీ రంగం కొత్త పుంతలు తొక్కుతుందనే అంచనాలు ఉన్నాయి.