NRI-NRT

చికాగోలో ఘనంగా NTR శతజయంతి వేడుక

చికాగోలో ఘనంగా NTR శతజయంతి వేడుక

ఎన్టీఆర్ స్ఫూర్తితో తెదేపాని అధికారంలోకి తీసుకురావాలని ఎన్ఆర్ఐ యూఎస్ కోఆర్డినేటర్ కోమటి జయరాం కోరారు. ఎన్టీఆర్ కలలుకన్న అభివృద్ధి, సంక్షేమ రాజ్యం రావాలన్నారు. ఆదివారం చికాగోలో ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల్లో భాగంగా నాలుగో మహానాడుకు జయరాం కోమటి అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, గుంటూరు మిర్చి యార్డ్ మాజీ ఛైర్మన్ మన్నవ సుబ్బారావు పాల్గొన్నారు
చికాగోలో ఘనంగా NTR శతజయంతి వేడుక
ఈ సందర్భంగా జయరాం మాట్లాడుతూ…చంద్రబాబు ముఖ్యమంత్రి కావడం చారిత్రక అవసరమని, ప్రస్తుత పాలకులపై నమ్మకం లేక పెట్టుబడులు ఆగిపోయాయని, అభివృద్ధి కుంటుపడిపోయిందని, అమరావతిలో పరిశ్రమలు స్థాపించేందుకు ప్రవాసాంధ్రులు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. దేవినేని ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ.. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని, ప్రశ్నిస్తే దాడులు చేస్తున్నారని, అన్న క్యాంటీన్లను అడ్డుకోవడం దుర్మార్గమని అన్నారు.
చికాగోలో ఘనంగా NTR శతజయంతి వేడుక
ప్రజలను చైతన్యపరచాల్సిన బాధ్యత ప్రవాసాంధ్రులపై ఉందని మన్నవ సుబ్బారావు అన్నారు. ఈ కార్యక్రమంలో చికాగో టీడీపీ సీనియర్ నాయకులు హేమ కానూరు, కాట్రగడ్డ రామకోటేశ్వరరావు, శ్రీలత గరికపాటి, చాందిని దువ్వూరి, వాసవి చక్కా, పొట్లూరి దేవీప్రసాద్, రవి కాకర, హను చెరుకూరి, హరీష్ జమ్ముల, చిరంజీవి గళ్ల, కృష్ణమోహన్, శ్రీనివాస్ పెదమల్లు, శ్రీహరి కట్టా, ప్రవీణ్ వేములపల్లి, మదన్ పాములపాటి, మహేష్ కాకరాల, వినోజ్ తదితరులు పాల్గొన్నారు.
చికాగోలో ఘనంగా NTR శతజయంతి వేడుక