అధిక కొలెస్ట్రాల్.. ఇప్పుడు చాలామందిని వేధిస్తున్న సమస్య. ఇది వివిధ హృదయ సంబంధ వ్యాధులకు దారితీస్తుంది. మొత్తం శరీరంపై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతుంది. అధిక కొలెస్ట్రాల్ వల్ల వికారం, అధిక రక్తపోటు, ఛాతీ బరువుగా అనిపించడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, విపరీతమైన అలసట కలుగుతుంది. ఈ లక్షణాలు కనిపిస్తే శరీరంలో అధిక కొలెస్ట్రాల్ పేరుకుపోయినట్టే. అయితే, హై కొలెస్ట్రాల్‌ను ఈజీగా తగ్గించే పండ్లు, కూరగాయలున్నాయని నిపుణులు చెబుతున్నారు. వీటిని రోజూ ఆహారంలో చేర్చుకుంటే అధిక కొవ్వు మైనంలా కరిగిపోతుందని అంటున్నారు. మరి అవేంటో చూద్దాం..
1. టమాటాలు..
టమాటాల్లో విటమిన్ A, B, C, Kలాంటి వివిధ రకాల పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి రక్తపోటు, కొలెస్ట్రాల్ స్థాయిని నియంత్రిస్తాయి. హృదయ సంబంధ వ్యాధుల బారినపడకుండా చూస్తాయి.
2. బొప్పాయి..
బొప్పాయిలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది, ఇది రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. అలాగే, ఎల్‌డీఎల్ లేదా చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రిస్తుంది.
3. అవకాడోలు..
కొలెస్ట్రాల్ స్థాయిల నిర్వహణలో అత్యుత్తమంగా పనిచేసే పండు అవకాడో. అందుకే దీన్ని వైద్యులు సిఫార్సు చేస్తుంటారు. ఇది స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఎల్‌డీఎల్, హెచ్‌డీఎల్ స్థాయిలను నియంత్రిస్తుంది.
4. యాపిల్స్..
రోజూ ఒక యాపిల్ తింటే డాక్టర్‌కు దూరంగా ఉండొచ్చని అందరికీ తెలిసిందే. ఇది చర్మం, జుట్టు ఆరోగ్యంతోపాటు గుండెకు కూడా మేలు చేస్తుంది. ఎల్‌డీఎల్ కొలెస్ట్రాల్ అనారోగ్య స్థాయిలను తగ్గిస్తాయి. మన గుండెకు హాని కలిగించే అనేక వ్యాధులను నివారిస్తాయి.
5. సిట్రస్ పండ్లు..
నారింజ, నిమ్మ, ద్రాక్షపండులాంటి అన్ని సిట్రస్ పండ్లలో విటమిన్ సీ పుష్కలంగా ఉంటుంది, ఇది కొలెస్ట్రాల్ స్థాయిలను అదుపులో ఉంచడంలో సహాయపడుతుంది. ఈ పండ్లు చర్మం, జుట్టుకు మాత్రమే కాకుండా చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను నిర్వహించడంలో కూడా తోడ్పడుతుంది.