Movies

హీరోయిన్‌ టబు బోల్డ్‌ కామెంట్స్‌

హీరోయిన్‌ టబు బోల్డ్‌ కామెంట్స్‌

సీనియర్‌ హీరోయిన్‌ టబుకి 50ఏళ్లు వచ్చినా ఇంకా పెళ్లి చేసుకోలేదు. తాజాగా ఓ ప్రెస్‌మీట్‌లో మాట్లాడిన టబు పెళ్లి, పిల్లలపై బోల్డ్‌ కామెంట్స్‌ చేసింది. ‘నాకు కూడా తల్లినవ్వాలనుంది. అయితే దీనికి పెళ్లిచేసుకోవాల్సిన అవరసం లేదు. పెళ్లికాకుండానే గర్భం దాల్చొచ్చు. సరోగసి ద్వారా కూడా తల్లినయ్యే అవకాశం ఉంది. పెళ్ళి కాకపోతే చచ్చిపోం, తల్లి కాకపోయినా చచ్చిపోం. ప్రస్తుతం కెరీర్‌, యాక్టింగ్‌ని ఎంజాయ్‌ చేస్తున్నాను.పెళ్లి, పిల్లలకి వయసుతో సంబంధం లేదు’ అంటూ పేర్కొంది. తన మనసుకి నచ్చినవాడు ఇంకా దొరకలేదని, మహిళల్ని అన్ని విధాలుగా గౌరవించేవాడు తనకు దొరికితే పెళ్లిచేసుకుంటానంటూ టబు ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌ చేసింది. ప్రస్తతం టబు చేసిన ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి