హైదరాబాద్ అమెరికా కాన్సులేట్ జనరల్ గా నియమితులైన జెన్నిఫర్ లార్సన్ ను వాషింగ్టన్ డి.సి.లో ఘనంగా సత్కరించారు. ఆమె గౌరవార్థం రవి పులి ఆధ్వర్యంలో నిర్వహించిన విందులో పాల్గొని ఆమె ప్రసంగించారు.
ఆసియాలోనే అతిపెద్ద కాన్సులేట్ హైదరాబాద్‌కు రాబోతోందని, 55 వీసా ఇంటర్వ్యూ కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నామని, కోవిద్ సమయంలో వెనుకబడిన వీసాదారుల దరఖాస్తులను త్వరితగతిన పూర్తి చేసేందుకు కృషి చేస్తానని జెన్నిఫర్ అన్నారు. అనంతరం అమెరికాలో సమాజ సేవ చేసే వారికి అందజేసే అధ్యక్ష జీవిత సాఫల్య పురస్కారాన్ని (President’s Lifetime Achievement Award) పులి రవికి జెన్నిఫర్ బహుకరించారు.
ఈ కార్యక్రమంలో డాక్టర్ రవి కోట, పార్థ కారంచెట్టి, USIBC, CII, FICCI,US India SME Council, Indian Embassy, CGI, Granules Pharmaప్రతినిధులు, భాను ఇల్లింద్ర, సంతోష్ సోమిరెడ్డి, జయంత్ చల్లా తదితరులు పాల్గొన్నారు.
హైదరాబాద్ అమెరికన్ కాన్సులేట్ తదుపరి కాన్సుల్ జనరల్‌కు డీసీ ప్రవాసుల సన్మానం
Related tags :