సిరిసిల్ల: ఎనిమిదేళ్లలో కేంద్రానికి గుర్తుకు రాని సెప్టెంబర్ 17 ఇప్పుడు గుర్తుకు వచ్చిందా అంటూ మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు.సిరిసిల్లలో తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాల వేడుకల్లో పాల్గొన్న కేటీఆర్ మాట్లాడుతూ……
రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ఆర్టికల్ మూడు లేకపోతే తెలంగాణ ఏర్పడేది కాదని,అందుకే అంబేడ్కర్ పేరు సీఎం కేసీఆర్ రాష్ట్ర సచివాలయానికి పెట్టారని అమిత్ షా వస్తున్నారు తెలంగాణకు ఏమైనా నిధులు తెస్తారా మరి? అని ప్రశ్నించారు.ఊకదంపుడు అని ఎద్దేవ చేశారు.మెగా పవర్ లూమ్ క్లస్టర్ కోసం ఎనిమిది ఏళ్ల నుంచి కాకి లెక్క మొత్తుకుంటున్నా అవి చేయరు.ఓ కాలేజీ తేరని మంత్రి విమర్శించారు. హిందూ ముస్లింలు పాత గొడవలు పాత విషయాలు తగ్గుకోవాలని బీజేపీ వాళ్లు అంటున్నారని కేటీఆర్ అన్నారు.అందరూ కలిసి ఉండాలని మేము అంటున్నామన్నారు.1956 లో ఆంధ్రప్రదేశ్ కు తెలంగాణతో ఇష్టం లేని పెళ్లి చేశారని అన్నారు.
తెలంగాణ ప్రజలు ఉద్యమాలు పోరాటాలు చేసి తెలంగాణ సాధించుకున్నామన్నారు. ఎనిమిదేళ్లలో లేనిది కొత్తగా కులం మతం అంటూ చిచ్చు పెడుతున్నారని మండి పడ్డారు.వైషమ్యాలు పెంచుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.హిందువులు ముస్లింలు అంటూ కుట్రలు చేస్తున్నారని అన్నారు. ప్రజలు గమనించాలని అన్నారు.అందరూ కలిసి ఉండాలని మేము అంటున్నామన్నారు.29 లక్షల మందికి మాత్రమే పింఛన్లు వచ్చేవని,ఇప్పుడు తెలంగాణ వచ్చాక 40 లక్షల మందికి పింఛన్లు వస్తున్నాయని తెలిపారు. 62 లక్షల రైతుల ఖాతాల్లో రైతు బంధు వస్తుందని అన్నారు.బీమా ఇస్తున్న దేశంలోనే ఏకైక ప్రభుత్వం తెలంగాణ అన్నారు. కరెంటు నీళ్ళు కళ్యాణ లక్ష్మి కేసీఆర్ కిట్ డబుల్ బెడ్ రూంలు అన్నీ వచ్చాయని గుర్తు చేశారు.మెడికల్ కాలేజీ వ్యవసాయ పాలిటెక్నిక్ వ్యవసాయ కాలేజ్ సిరిసిల్ల కు వచ్చాయని కేటీఆర్ అన్నారు.చేనేత కార్మికులకు కడుపు నిండా పని దొరుకుతుందని తెలిపారు.70 ఎండల్లో కాని అభివృద్ధి తెలంగాణలో ఎనిమిదేళ్లలో జరిగిందని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు.