తైవాన్(Taiwan) ఆగ్నేయ తీరంలో ఆదివారం భారీ భూకంపం(Earthquake) సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై దీని తీవ్రత 6.8గా నమోదైంది. ఇక్కడి చిషాంగ్ పట్టణంలో ఏడు కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం నమోదైనట్లు తైవాన్ వాతావరణ విభాగం వెల్లడించింది. శనివారం సైతం అదే ప్రాంతంలో 6.6 తీవ్రతతో భూకంపం సంభవించింది. అప్పటినుంచి ప్రకంపనలు వస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే నేటి మధ్యాహ్నం భారీ తీవ్రతతో భూకంపం వచ్చింది. అయితే, క్షతగాత్రుల సంఖ్య తెలియరాలేదు. రాజధాని తైపీ(Taipi)లోనూ ప్రకంపనలు కనిపించాయి. తమ తీర ప్రాంతాల్లోని ఫుజియాన్, గ్వాంగ్‌డాంగ్, జియాంగ్సు, షాంఘైలోనూ ప్రకంపనలు నమోదయ్యాయని చైనా(China) తెలిపింది. భారీ భూకంపం కారణంగా జపాన్ వాతావరణ సంస్థ సైతం తైవాన్ సమీపంలోని దక్షిణ జపనీస్ దీవులకు సునామీ హెచ్చరికలు జారీ చేసింది.
సునామీ హెచ్చరికలు జారీ
Related tags :