ట్రయాంగిల్ ఏరియా తెలుగు అసోసియేషన్ (టాటా) ఆఫ్ నార్త్ కరోలినా వారు నిర్వహిస్తున్న ఈ తెలుగుబడి ముఖ్య ఉద్దేశ్యం ప్రవాసంలో ఉన్న తెలుగు పిల్లలకు మనదైన తేనెలొలికే తెలుగు భాషలో మాట్లాడడం, చదవడం మరియు వ్రాయడం నేర్పించడం, మన పండుగలు, సంస్కృతి గురించి తెలియజేయడం. వారిని అన్ని తరగతుల లేదా స్థాయిలలో తెలుగులో మాట్లాడడానికి ప్రోత్సహించడం జరుగుతుంది. టాటా తెలుగుబడిలో పాఠ్యాంశములను ఆరు తరగతులుగా విభజించబడినవి. అవి 1-ప్రవేశం, 2-ప్రవాళం, 3-ప్రధానం, 4-ప్రవర్థం మరియు 5-ప్రావీణ్యం.