వచ్చే ఏడాది మే 26, 27, 28 తేదీల్లో న్యూజెర్సీలో నాట్స్ 7వ సంబరాలు నిర్వహిస్తున్నట్లు కన్వీనర్ అప్పసాని శ్రీధర్ తెలిపారు. ఈ సంబరాలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు తొమ్మిది కమిటీలను ప్రకటించారు. ప్రోగ్రామ్స్, హాస్పిటాలిటీ, ఆపరేషన్స్, రిజిస్ట్రేషన్, పబ్లిసిటీ అండ్ మార్కెటింగ్, రెవిన్యూ జనరేషన్, కమ్యూనిటీ సర్వీసెస్, స్పోర్ట్స్ అండ్ కాంపిటీషన్స్, యూత్ కమిటీలు ఇందులో ఉన్నాయి. సంబరాల కమిటీ కో కన్వీనర్లుగా వసుంధర దేసు, రాజేంద్ర అప్పలనేని, పబ్లిసిటీ అండ్ మార్కెటింగ్ డైరెక్టర్‌గా మురళీ కృష్ణ మేడిచెర్లకు బాధ్యతలు అప్పగించారు.
“అమెరికా తెలుగు అమ్మాయి” అనే పోటీలు నిర్వహించాలని నాట్స్ నాయకత్వం నిర్ణయించింది. నాట్స్ ప్రతినిధులు మధు కొర్రపాటి, సామ్ మద్దాలి, బోర్డు సెక్రెటరీ శ్యామ్ నాళం, బోర్డ్ డైరెక్టర్స్ రాజ్ అల్లాడ, చంద్రశేఖర్ కొణిదెల, శ్రీహరి మందాడి, వంశీ కృష్ణ వెనిగళ్ల, హరినాథ్ బుంగటావుల, నాట్స్ సెక్రెటరీ రంజిత్ చాగంటి, గురుకిరణ్ దేసు, సూర్య గుత్తికొండ, నాట్స్ ఛైర్ విమెన్ అరుణ గంటి, నాట్స్ అధ్యక్షుడు బాపు నూతి తదితరులు పాల్గొన్నారు.