WorldWonders

అత్తమామలపై కోడలి జుగుప్సాకర అరాచకం

అత్తమామలపై కోడలి జుగుప్సాకర అరాచకం

ప్రియుడితో కలిసి కుట్ర పన్నిన ఓ మహిళ తన సొంత అత్తామామల నగ్న వీడియోలను తీసిన దారుణ ఉదంతమిది. దిల్లీలోని లక్ష్మీనగర్‌ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తికి (ఆభరణాల వ్యాపారి) తన భార్యతో నాలుగేళ్లుగా గొడవలు జరుగుతున్నాయి. వారిద్దరూ ఒకే ఇంట్లో.. వేర్వేరు గదుల్లో ఉంటున్నారు. భార్యకు తన స్నేహితుడితో అక్రమ సంబంధం ఉన్నట్లు భర్త ఇటీవల గుర్తించాడు. బండారం బయటపడటంతో.. ఇంట్లో ఉన్న రూ.కోటికి పైగా విలువైన ఆభరణాలు, కొంత నగదు తీసుకొని ఆమె ప్రియుడితో కలిసి పారిపోయింది. దీంతో భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. భర్తకు ఫోన్‌ చేసిన భార్య.. బెదిరింపులకు దిగింది. తమ ఇంట్లో అత్తమామల (భర్త తల్లిదండ్రులు) గదిలో రహస్య కెమెరాలు పెట్టి.. వారి నగ్న వీడియోలు తీసిన విషయాన్ని బయటపెట్టింది. తనపై కేసును వెనక్కి తీసుకోకపోతే.. ఆ వీడియోలను సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేస్తానంటూ భర్తను బెదిరించింది. ఈ వ్యవహారంపై పోలీసులు కేసు నమోదు చేశారు.