Politics

యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ రాజీనామా

యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ రాజీనామా - Yarlagadda Lakshmiprasad Resigns To AP Official Language Commission

అధికార భాషా సంఘం అధ్యక్షులు యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ రాజీనామా. ఎన్ టి ఆర్ ఆరోగ్య విశ్వ విద్యాలయం పేరు మార్చి వైఎస్సార్ పేరు పెట్టడం పై నాకు చాలా బాధగా ఉంది. హిందీ అకాడమీ, అధికార భాషా సంఘం లాంటి కీలక పదవులు ఇచ్చి గౌరవించారు ముఖ్యమంత్రి. వైఎస్సార్ పేరు పెట్టడం పట్ల అభ్యంతరం లేదు కానీ ఎన్ టి ఆర్ పేరు తొలగించడం సరైన నిర్ణయం కాదు. – YLP

ఎన్టీఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయం పేరు మార్పు నిర్ణయాన్ని నిరసిస్తూ అధికార భాషా సంఘం అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్లు యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్‌ ప్రకటించారు. ఎన్టీఆర్‌ ఆరోగ్య వర్సిటీ పేరు మార్పు నిర్ణయం సరికాదని ఆయన పేర్కొన్నారు. మహానుభావుడి పేరు ఆరోగ్య వర్సిటీకి ఉంచాలన్నదే తన అభిప్రాయమని చెప్పారు.