Sports

TPGL:తెలంగాణా ప్రీమియర్ గోల్ఫ్ లీగ్ 2022 పోటీలు

TPGL:తెలంగాణా ప్రీమియర్ గోల్ఫ్ లీగ్ 2022 పోటీలు

తెలంగాణ ప్రీమియర్‌ గోల్ఫ్‌ లీగ్‌ (టీపీజీఎల్‌) రెండో సీజన్‌ పోటీలను ప్రారంభించబోతున్నట్లు హైదరాబాద్‌ గోల్ఫ్‌ అసోసియేషన్‌ వెల్లడించింది. మూడు విభిన్నమైన ఫార్మాట్లలో సాగే ఈ పోటీలు హైదరాబాద్‌లో సెప్టెంబర్‌ 25 నుంచి అక్టోబర్‌ 30 వరకు జరుగనున్నాయి. శుక్రవారం నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో హైదరాబాద్‌ గోల్ఫ్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు జయంత్‌ ఠాగోర్ వివరాలు వెల్లడించారు. ఈ లీగ్‌ ద్వారా గోల్ఫింగ్‌ను జంట నగరాలకు దగ్గర చేస్తున్నామని, దీనిపై అత్యున్నత స్థాయి అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. అనేక బృందాలను పాల్గొనేలా చేస్తున్నట్లు పేర్కొన్నారు.