Devotional

తిరుమల కొండ ఎక్కాలనుకునే వాహనాలకు కొత్త నిబంధన

తిరుమల కొండ ఎక్కాలనుకునే వాహనాలకు కొత్త నిబంధన

తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీగా భక్తులు తరలివస్తారనే ఆలోచనతో తితిదే నిఘా, భద్రతా విభాగం ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసింది. తిరుమలకు వెళ్లే అన్ని వాహనాలు 12వేలు దాటిన తరువాత అనుమతించకూడదని నిర్ణయించింది. వాహనాలను తిరుపతిలోని పార్కింగ్‌ ప్రాంతాల్లో నిలిపి ఆర్టీసీ బస్సుల ద్వారా తిరుమలకు వెళ్లాలని సూచించింది. ఏటా గరుడ వాహన సేవ రోజు ఉదయం నుంచి మరుసటి రోజు వరకు ఘాట్ రోడ్డులో ద్విచక్ర వాహనాలను అనుమతించరు. ఈ ఏడాది గరుడ సేవ 1వ తేదీ కాగా.. ఈ నెల 30వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి అక్టోబరు 2 వరకు ద్విచక్ర వాహనాలను ఘాట్ రోడ్డులో అనుమతించకుండా చర్యలు తీసుకున్నారు.