Food

పచ్చి పనసపొట్టు పొడితో మధుమేహ నియంత్రణ

పచ్చి పనసపొట్టు పొడితో మధుమేహ నియంత్రణ

మధుమేహ చికిత్సలో ప్రభావవంతమైన వైద్య పోషకాహార చికిత్సగా పచ్చి పనసపొట్టు పిండి పనిచేస్తుందని ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన ఓ అధ్యయనం నిరూపించింది. శ్రీకాకుళంలోని ప్రభుత్వ వైద్య విజ్ఞాన సంస్థలో జరిగిన ఈ అధ్యయనంలో పచ్చి పనసపొట్టు పిండి ప్రయోజనాలను గుర్తించారు. పచ్చి పనసపొట్టు పిండికి మధుమేహ రోగుల్లో బ్లడ్‌ షుగర్‌ స్థాయిలను నియంత్రించే శక్తి ఉందని నిర్ధారించారు. ఈ అధ్యయన ఫలితాలను ‘జాక్‌ఫ్రూట్‌365’ సంస్థ వ్యవస్థాపకుడు జేమ్స్‌ జోసెఫ్‌ పలువురు వైద్య నిపుణులతో కలసి శుక్రవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెల్లడించారు. నిత్యం తగిన మోతాదులో పచ్చి పనసపొట్టు పిండిని తీసుకోవడం వల్ల బ్లడ్‌ షుగర్‌ నియంత్రణలో ఉంటున్నట్లు వైద్య బృందం సైతం నిర్ధారించిందన్నారు.