కాంగ్రెస్(Congress) అధ్యక్ష పదవికి పార్టీ సీనియర్ నేత, తిరువనంతపురం ఎంపీ శశిథరూర్ (Shashi Tharoor) పోటీ ఖరారైంది. ఈ మేరకు శనివారం ఆయన నామినేషన్ పత్రాలు తీసుకున్నారు. దీంతో ఈ పదవి రేసులో అధికారికంగా బరిలో దిగిన మొదటి అభ్యర్థిగా నిలిచారు. పార్టీ అధ్యక్ష ఎన్నికల్లో పోటీకి సిద్ధమంటూ తన ఉద్దేశాన్ని వ్యక్తపరచిన తొలి నేత కూడా శశిథరూరే. ఈ మేరకు ఇటీవల పార్టీ అధినేత్రి సోనియా గాంధీ(Sonia Gandhi)ని కలిసి.. ఇదే విషయాన్ని చెప్పారు. అందుకు ఆమె గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్టు పార్టీ వర్గాలు వెల్లడించాయి! పార్టీలో సంస్థాగతపర సంస్కరణలు చేపట్టాలని డిమాండ్ చేస్తోన్న రెబల్ గ్రూపు ‘జీ-23’లో ఉన్న థరూర్.. ప్రస్తుతం అధ్యక్ష ఎన్నిక బరిలో నిలవడం ప్రాధాన్యం సంతరించుకుంది.
కాంగ్రెస్ అధ్యక్ష రేసులో శశిథరూర్?
Related tags :