తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) పాలక మండలి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈరోజు(శనివారం) శ్రీవారి బ్రహ్మోత్సవాలపై చర్చించింది. రెండేళ్ళ తర్వాత ఆలయం వెలుపల జరిగే బ్రహ్మోత్సవాలకు భక్తులకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని నిశ్చయించింది. అదే సమయంలో సామాన్య భక్తులకు పెద్ద పీట వేసింది. దాంతో పాటు పలు నిర్ణయాలు తీసుకుంది
శాశ్వత వసతికోసం గోవర్ధన్ అతిధి గృహం వెనుక రూ. 95 కోట్లతో నూతన వసతి భవనం నిర్మాణానికి అమోదం.
తిరుపతిలో వకుళామాత ఆలయం అభివృద్ధికి పాలకమండలి నిర్ణయం
తిరుమలలో వసతిగృహాల్లో గీజర్ల ఏర్పాటుకు రూ.7.9 కోట్ల ఆమోదం
నెల్లూరు లో శ్రీవారి ఆలయం,కళ్యాణమండపం నిర్మాణానికి అమోదం
తిరుపతి ఎస్వీ ఆర్ట్స్ కళాశాల రూ. 6.37 కోట్లతో అభివృద్ధి
టిటిడి ఉద్యోగులు ఇళ్ల స్థలాలు మంజూరు
300 ఎకరాలతో పాటు మరో 130 ఎకరాలు కొనుగోలుకు అమోదం
బ్రహ్మోత్సవాల అనంతరం ఎస్ఎస్డి టికెట్లు ప్రారంభం.
సామాన్య భక్తులకు పెద్ద పీట.. VIP దర్శనం ఉదయం 10 నుండి 12 గంటల మధ్య మార్పుకు పాలకమండలి నిర్ణయం