Food

పేగు క్యాన్సర్లకు కారణం…జంక్ ఫుడ్

పేగు క్యాన్సర్లకు కారణం…జంక్ ఫుడ్

జంక్‌ ఫుడ్‌తో గ్యాస్ట్రిక్‌ క్యాన్సర్‌ ఎక్కువగా వస్తోందని నిపుణుల అభిప్రాయం. ఎక్కువకాలం నిల్వ ఉన్న ఆహార పదార్థాలు, కూరగాయలు, ఫాస్ట్‌ఫుడ్‌ తినడంతో గ్యాస్ట్రిక్‌ క్యాన్సర్‌ వచ్చే అవకాశం ఉంటుంది. ఉప్పు తినడంతో కూడా ప్రమాదం ఉంటుంది. పొగాకు వినియోగం, మద్యపానంతో కూడా వస్తుంది. కొద్దిగా తిన్నా కడుపు నిండినట్టు ఉంటుంది. వాంతులు కావడం, వాంతిలో రక్తం పడే లక్షణాలు కనిపిస్తాయి. పచ్చకామెర్లు, ఊపిరి తీసుకోవడం కష్టంగా ఉంటుంది. గ్యాస్ట్రిక్‌ క్యాన్సర్‌ కణితిని ఆపరేషన్‌ చేసి తీసేయాల్సిందే. అవసరమయితే కిమో, రేడియోథెరపీ కూడా చేయకతప్పదు. సరయిన సమయంలో చికిత్స చేయించుకుంటే ప్రాణానికి ప్రమాదం ఉండదు. ఆహార పద్ధతులు సరిగా ఉండేలా చూసుకోవాలి. పండ్లుఎక్కువగా తీసుకోవాలి. వ్యాయామం చేస్తే ఈ జబ్బు వచ్చే ప్రమాదం ఉండదు.