ScienceAndTech

పోలీసులకు యాంటీ డ్రోన్‌ వాహనం..

పోలీసులకు యాంటీ డ్రోన్‌ వాహనం..

పోలీసులకు యాంటీ డ్రోన్‌ వాహనం.. ఎక్కడంటే..? భద్రత కోసం దేశంలోనే తొలిసారిగా చర్యలు చేపట్టింది కేరళ ప్రభుత్వం. యాంటీడ్రోన్‌ వాహనాన్ని సమకూర్చుకుని దేశంలోనే తొలిసారిగా ఈ సదుపాయాన్ని పొందిన వారిగా కేరళ పోలీసులు ఘనత సాధించారు. అంతేకాదు ఈగల్‌ ఐ గా వ్యవహరిస్తున్న ఈ వాహనాన్ని ఆ శాఖకే చెందిన డ్రోన్‌ ఫోరెన్సిక్‌ డిపార్ట్‌మెంట్‌ రూ.80 లక్షలతో అభివృద్ధి చేయడం విశేషం.

దీని సాయంతో అనుమతిలేకుండా ఎగిరే, దాడికి పాల్పడే డ్రోన్లను కూల్చివేస్తారు. విమానాశ్రయాలు, ప్రముఖులు ఎక్కువగా సంచరించే ప్రాంతాల్లో ఈ వాహనాన్ని మోహరిస్తారు. ఇందులోని యాంటీ డ్రోన్‌ వ్యవస్థ అయిదు కిలోమీటర్ల పరిధిలో అనుమతుల్లేకుండా వినియోగించే డ్రోన్లను గుర్తించడంతోపాటు వాటిని కూల్చివేస్తుంది.