Movies

ముంబైలో వ్యభిచారం చేస్తూ పట్టుబడిన హీరోయిన్లు

ముంబైలో వ్యభిచారం చేస్తూ పట్టుబడిన హీరోయిన్లు

రంగుల మాయా ప్రపంచంలో ఏ మూల ఏం జరుగుతుందో ఊహించడం చాలా కష్టం. ఈ రంగంలో అవకాశాలు ఉన్నంతవరకూ అంతా సవ్యంగానే సాగుతుంది. ఉపాధి కరువై ఆ తర్వాత ఒకసారి తప్పుదారిలో డబ్బు సంపాదించడం ప్రారంభిస్తే ఆ తర్వాత పర్యవసానాలు అంతే దారుణంగా ఉంటాయి. అందుకు ఇంతకుముందు శ్వేతాబసు ప్రసాద్ ఉదంతం పెద్ద సాక్ష్యంగా నిలుస్తుంది.

తాజాగా ఇద్దరు తమిళ హీరోయిన్లు ముంబైలో వ్యభిచారం చేస్తూ పోలీసులకు పట్టుబడడం సంచలనంగా మారింది. కేవలం కథానాయికలు మాత్రమే కాదు.. వారితో పాటు టాప్ మోడల్స్ కూడా ఉన్నారని పోలీసులు నివేదిస్తున్నారు. నిజానికి ఈ రాకెట్ లో చిక్కింది తాము మాత్రమే కాదని తమతో పాటు పలువురు నటీమణులు మోడల్స్ చాలా మంది ఉన్నారని వారంతా సంపాదించుకుని వెళ్లారని కూడా సదరు హీరోయిన్లు చెప్పడంతో పోలీసులు అవాక్కయ్యారు.
రంగుల ప్రపంచంలో అప్పుడప్పుడు ఇలాంటివి చూస్తున్నదే.. కానీ ఈసారి ఇలా వ్యభిచార కూపంలో చిక్కుకోవడానికి కారణమేమిటి? అన్నది ఆరా తీస్తే సదరు కథానాయికలు చెప్పిన కారణం నిశ్చేష్టులను చేస్తోంది. ఏడాదిన్నరగా కరోనా మహమ్మారీ ఆర్టిస్టులకు ఇండస్ట్రీ కార్మికులకు ఉపాధి లేకుండా చేస్తోంది. ఇటీవల సినిమాల్లేక కనీస మెయింటెనెన్స్ కి కూడా కష్టమై చివరికి ఇలా మారారు.