నాలుగు శతాబ్దాల చరిత్రకు నీరాజనం
కనివిని ఎరుగని బ్రహ్మాండభరిత మైసూరు దసరా ఉత్సవం. దసరాకు నెల రోజుల ముందు నుంచే మొదలయ్యే సంబరాలు దేశవిదేశాల నుంచి లక్షల సంఖ్యలో వచ్చే పర్యాటకులు ఏటా అధికారికంగా నిర్వహిస్తున్న కర్ణాటక ప్రభుత్వం 1610 సంవత్సరం నుంచి నిరంతరాయంగా జరుగుతున్న ఉత్సవాలు ఇప్పటికీ రాజకుటుంబం చేతుల మీదుగా జరిపించే దసరా వేడుక గజరాజు మీద స్వర్ణ అంబారీపై చాముండేశ్వరీ దేవి ఊరేగింపు – విద్యుత్ దీపాల వెలుగులతో అలరారే మైసూర్ ప్యాలెస్ • కర్నాటక సంస్కృతికి ప్రతీకగా నిలిచే మైసూరు దసరా ఉత్సవాలు. కరోనా నేపథ్యంలో ఈ సారి సాదాసీదాగా నిర్వహిస్తున్న వేడుకలుతింటే గారెలే తినాలు.. వింటే భారతమేవినాలి అన్నట్టుగా చూస్తే మైసూరులో జరిగే దసరా వేడుకలనే చూడాలి.
గత నాలుగు వందల సంవత్సరాలుగా మైసూరులో దసరా వేడుకలు జరుగుతున్నాయి. దేశ విదేశాల నుంచి ఈ వేడుకలను చూడటానికి పర్యాటకులు భారీ సంఖ్యలో వస్తారు.మైసూరులో దసరా ఉత్సవాలు ఎంత వైభవంగా జరువుతారో చెప్పడానికి ఈ ఒక్క ఉదాహరణ చాలు.మెసూరు దసరా ఉత్సవాల సందడి దసరా రావడానికి ఘనెల ముందు నుంచే ప్రారంభమవుతుంది. ఇక్కడ దసరా ఉత్సవాలను కర్ణాటక ప్రభుత్వం అధికారికంగా నిర్వహి స్తుంది. బాలల దసరా, రైతుల దసరా, మహిళల దసరా, యువకుల దసరా…
ఇలా మైసూరులో ఎవరి దసరా వాళ్ళు వేరువేరుగా చేసుకుంటారు. మైసూర్ పరిసరాల్లో, పరిసర
గ్రామాల్లో అత్యంత వైభవోపేతంగా దసరాను నిర్వహిస్తారు. ఆటల, పాటల పోటీలు, ప్రదర్శనలు, యువజనోత్సవాలు, ఆహారోత్సవాలు…. ఒక్కటేమిటి… దసరా సందర్భంగా అనేక వేడుకలు మైసూరులో నిర్వహిస్తారు. మైసూరుకు చెందిన రాజ
కుటుంబం 400 సంవత్సరాల క్రితం ప్రారంభించిన వేడుకలు ఈరోజుకీ అంతే ఉత్సా హంతో, అంతే భక్తి శ్రద్ధలతో జరుగుతూ వుండటం విశేషం.
మైసూరులో 1610వ సంవత్సరం నుంచి దసరా వేడుకలు జరువుతున్నారని చరిత్ర చెబుతోంది. వడయార్ రాజ వంశం ఈ వేడుకలను ప్రారంభించింది. అంతకుముందు శ్రీరంగ పట్నం రాజధానిగా పరిపాలన చేసిన వడయార్ వంశీకులు 1610లో తమ రాజధానిని మైసూరుకు మార్చారు. అప్పటి నుంచి దసరా వేడుకలు
వైభవంగా జరుగుతున్నాయి. భారత దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించిన తర్వాత మైసూర్ రాజ్యాన్ని భారతదేశంలో విలీనం చేశారు. అయినప్పటికీ ఇప్పటికీ మైసూరు దసరా వేడుకలు రాజకుటుంబం చేతుల మీదుగానే జరుగుతున్నాయి. దసరా ముందు
జరిగే వేడుకల సంగతి అలా వుంచితే, దసరా రోజున జరిగే కీలకమైన వేడుక కన్నులకు విందు చేస్తుంది.. గజరాజు మీద స్వర్ణ అంబారీ వుంచి, దానిలో చాముండి దేవి విగ్రహాన్ని ప్రతిష్టించి ఊరేగిస్తారు.
ఒక చెట్టు కలపతో, 750 కిలోల బంగారం తాపడం
చేసిన అంబారీ ఈ ఉత్సవాల్లో మరో ప్రధాన ఆకర్షణ. విజయదశమి నాడు ఈ అంబారీ రాజసం ఉట్టి పడేలా లక్షలాది మందికి కన్నుల పండుగ చేస్తూ మెసూర్ ప్రధాన వీధులగుండా సాగుతుంది. ఈ ఉత్సవాల్లో గజరాజులపై జంబూ సవారీయే కీలకమైన ఘట్టం. స్వర్ణ అంబారీ కట్టిన ఏనుగుతోపాటు మరికొన్ని ఏనుగులు సర్వాలంకార భూషితంగా ఈ వేడుకలో పాల్గొంటాయి.
ఈ అద్భుతమైన కార్యక్రమాన్ని తిలకించేందుకు దేశ విదేశాల నుంచి లక్షలాదిమంది భక్తులు మైసూరుకు తరలి వస్తుంటారు. దసరాకు ముందు తొమ్మిది రోజులపాటు శక్తిమాతకు పూజలు జరుగుతాయి. దుర్గ, లక్ష్మీ, సరస్వతి, కాళీ, చాముండేశ్వరీ రూపాలను పూజిస్తారు. జమ్మి చెట్టుకు పూజలు నిర్వహించడం, వాటి ఆకులను పరస్పరం పంచుకో వడంతోపాటు నవమి నాడు ఆయుధ పూజ చేస్తారు. ఆయుధ పూజ రోజున అన్ని వృఎత్తుల వారు తమ తమ పనిముట్లను, వాహనాలను శుభ్రంగా కడిగి వాటికి పూజలు జరపడం,
మిఠాయిలు పంచుకోవడం ఆనవాయితీ. దసరా రోజున మైసూరు మహారాజా ప్యాలెస్ను లక్షలాది విద్యు
ద్దీపాలతో దేదీప్యమానంగా అలంకరిస్తారు. మెసూర్ మహారా జుల నివాసం అయిన ఈ ప్యాలెస్లోనే ఉత్సవాలకు సంబంధిం చిన విలువైన వస్తువులను భద్రపరుస్తారు.
ప్యాలెస్లోని అత్యంత విలువైన బంగారు సింహాసనాన్ని దసరా వేడుకలు జరిగే పది రోజుల పాటు ప్రజలకు తిలకించే అవకాశాన్ని కల్పిస్తారు. అంబారీ ప్రదర్శనకు ఒక రోజు ముందు దసరా దివిటీల ప్రదర్శన నిర్వహిస్తారు. ఇటీవలి కాలంలో లేజర్ షో కూడా ఏర్పాటు
చేస్తున్నారు. దసరా సందర్భంగా మైసూరులో వివిధ శకటాల ప్రదర్శన జరుగుతుంటుంది. ఇందులో
వివిధ జిల్లాలు. శాఖల అభివృద్ధినిప్రదర్శించడం ఆనవాయితీగా వస్తోంది. ఉత్సవాలను మెసూర్ ప్రజలు తమ వారసత్వ సం పదగా భావిస్తూ భక్తిశ్ర ద్దలతో జరువుకుంటారు. దసరా సందర్భంగా ప్రతి ఇల్లూ దసరా శోభతో కళకళలా డుతూ వుంటుంది. ప్రతి ఇంట్లోనూ బొమ్మల కొలువులు ఏర్పాటు చేసుకుం టారు. ఒక్క మాటలో చెప్పాలంటే, మైసూరు దసరా వేడుకలు మా టల్లో చెప్పాల్సినవి కావు… ప్రత్యక్షంగా చూడాల్సినవి. కర్ణాటక రాష్ట్రంలోని మైసూర్లో జరిగే దసరా ఉత్సవాలకు ప్రపంచవ్యాప్తంగా పేరుంది.
ఈ ఉత్సవాలనుచూడటానికి ప్రపంచం నలుమూలలనుంచి జనం వస్తూ ఉంటారు. 10 రోజుల పాటు నిర్వహించే ఉత్సవాలు కర్ణాటక సంస్కృతికి అద్దం పడతాయి. ఈ పది రోజులూమైసూరు ప్యాలెస్, చాముండీ కొండ దీప కాంతుల్లో వెలిగి పోతుంది. ఈ రెండూ చూడటనాకి కూడా పర్యాటకులు ఎంతో ఉత్సాహం చూపిస్తుంటారు. దీంతో ఇసుకేస్తే రాలనంత జనంతో ప్యాలెస్ ప్రాంతం కిటకిట లాడేది. కానీ, ఈ సంవత్స రం అలా జరగలేదు. కరోనా ప్రభావంతో మైసూర్ దసరా ఉత్సవాలను నిరాడంబరంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో వందల ఏళ్ల చరిత్ర కలిగిన ఉత్సవాలు వెలవెలబోయే పరిస్థితి ఏర్పడింది. 400 ఏళ్లకు పైగా చరిత్ర మైసూర్ ఉత్సవాలకు 400
ఏళ్లకు పైగా చరిత్ర ఉంది.
ఇక్కడిదసరా ఉత్సవాలను నదహబ్బ అని పిలుస్తారు. ఈ పండుగ సందర్భంగా మైసూర్లోని అమ్మవారు చాముండేశ్వరీ దేవిని పూజించటం ఆనవాయితీ. విజయనగర రాజుల కాలంలో 15వ శతాబ్దంలో ఈ ఉత్సవాలు మొదలైనట్లు చారిత్రక ఆధా రాల ద్వారా
తెలుస్తోంది. పర్షియాకు చెందిన రాయబారి అబ్దుల్ రజాక్ తన వుస్తకంలో విజయనగర రాజులు నిర్వహి స్తున్న దసరా ఉత్సవాల గురించి రాసుకున్నాడు. విజయనగర సామ్రాజ్య పతనానంతరం మైసూరు రాజులైన ఉడయార్లు మైసూరుకు దగ్గర్లో ఉన్న శ్రీరంగపట్నంలో దసరా ఉత్సవాలు ప్రారంభించారు. రాజా ఉడయార్ .. 1610లో ఈ ఉత్స వాలను మొదలుపెట్టారని తెలుస్తోంది. 1805లో కృష్ణరాజు ఉడయార్ సమయం నుండి దసరా నాడు మైసూరు ప్యాలస్లో ప్రత్యేక రాజదర్బారు నిర్వహించడం
మొదలుపెట్టారు. ఆ తరువాత అది ఆచారంగా మారిపోయింది. పండుగకు నెల ముందు నుంచే.. దసరా అంటేనే పది రోజుల పండుగ. అయితే మైసూర్ దసరా ఉత్సవాలు చాలా ప్రత్యేకం. నెల రోజుల ముందు నుంచే మైసూరు మొత్తం పండుగ వాతావరణాన్ని సంతరించు
కుంటుంది.
బాలల దసరా, రైతుల దసరా, మహిళల దసరా, యువకుల దసరా… ఇలా మైసూరులో ఎవరి దసరా వాళ్లు వేరువేరుగా చేసుకుంటారు. మైసూర్ పరిసరాల్లో, పరిసరగ్రామాల్లో అత్యంత వైభవోపేతంగా దసరాను నిర్వహిస్తారు. ఈ ఉత్సవాలను కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వ హిస్తుంది. ఆటలు, పాటల పోటీలు, ప్రదర్శనలు, యువజనో త్సవాలు, ఆహారోత్సవాలతో కన్నుల పండుగగా ఉత్సవాలు జరుగుతాయి.