NRI-NRT

TANA: డా.కొడాలి ఇంట విషాదం. భార్య కుమార్తెల దుర్మరణం.

డా.కొడాలి ఇంట విషాదం. భార్య కుమార్తెల దుర్మరణం. - TANA BOD Nagendra Srinivas Kodali Wife and 2Daughters Dead In Car Crash

తానా డైరక్టర్ల బోర్డు సభ్యుడు, హ్యూస్టన్‌కు చెందిన ప్రవాసాంధ్రుడు డా.కొడాలి నాగేంద్ర శ్రీనివాస్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయన భార్య వాణీ, ఇద్దరు కుమార్తెలు వాలర్ కౌంటీలో జరిగిన ఘోర రహదారి ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. వైద్య విద్యను అభ్యసిస్తున్న పెద్ద కుమార్తెను దసరాకు ఇంటికి తీసుకురావడానికి వాణీ, ఆమె చిన్న కుమార్తె వెళ్లారు. తిరుగు ప్రయాణంలో వీరు ప్రయాణిస్తున్న లెక్సస్ కారును షెవీ పికప్ ట్రక్కు ఢీకొనడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరిని ఆసుపత్రికి తరలించినప్పటికీ ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు వెల్లడించారు. శ్రీనివాస్ కుటుంబానికి తానా ప్రతినిధులు తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

డా.కొడాలి ఇంట విషాదం. భార్య కుమార్తెల దుర్మరణం. - TANA BOD Nagendra Srinivas Kodali Wife and 2Daughters Dead In Car Crash

More Info: https://www.fox26houston.com/news/at-least-2-dead-following-major-crash-in-waller-county-officials-investigating