నెల్లూరు జిల్లా…కావలి
💥కావలి రూరల్ సీఐ సస్పెన్షన్💥
నెల్లూరు జిల్లా కావలి రూరల్ సర్కిల్ ఇన్స్‌పెక్టర్ ( సీఐ) గా విధులు నిర్వహిస్తున్న షేక్ ఖాజావళి ని గుంటూరు రేంజ్ డీఐజీ డాక్టర్ సీఎం త్రివిక్రమ్ వర్మ సస్పెండ్ చేస్తూ మంగళవారం ఆదేశాలు జారీ చేశారు.
నెల్లూరు జిల్లా లోని కృష్ణ పట్నం పోర్ట్ సీఐ గా ఉన్న సమయంలో బొగ్గు కేసు విషయంలో రూ.65 లక్షలు తీసుకున్న ఆరోపణల పై విచారించి సస్పెండ్
తిరుపతిలో బందోబస్తు విధుల్లో ఉన్న ఖాజావళి ని జిల్లా ఎస్పీ సీహెచ్ విజయారావు నెల్లూరు లోని తన కార్యాలయానికి పిలిపించి సస్పెన్షన్ ఉత్తర్వులు అందజేశారు. వెంటనే కావలి రూరల్ సీఐ గా విధుల నుంచి ఖాజావళి తప్పుకున్నారు. కాగా ఏడాది పాటు కావలి రూరల్ సీఐగా ఖాజావళి భాధ్యతలు నిర్వహించారు.
విజయవాడ
ఇంద్రకీలాద్రి.
ఇంద్రకీలాద్రిపై అపచారం…
ఆలయ ప్రతిష్టను దెబ్బతిస్తున్నా సెక్యూరిటీ ఏజెన్సీ…
మద్యంసేవించి విధులు నిర్వహిస్తున్న సెక్యూరిటీ ఇంఛార్జ్ చంద్ర…
మద్యం మత్తులో ఈవో వచ్చిన పట్టించుకోకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన ఈవో భ్రమరాంబ….
సెక్యూరిటీ ఇంఛార్జ్ చంద్ర ని వైద్య పరీక్షలు కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన అధికారులు.
సెక్యూరిటీ ఏజన్సీ పై శాఖ పరమైన ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి.
గతంలో కూడా ఈ సెక్యూరిటీ ఏజన్సీ పై పలు ఆరోపణలు ..
ప్రభుత్వాసుపత్రి లో సామూహిక అత్యాచారం ఘటనలో ఆరోపణలు ఎదుర్కొన్న ఎజిల్ సెక్యూరిటీ ఏజెన్సీ..
స్కోలింగ్ , నెల్లూరు… ఉదయగిరి నియోజకవర్గం
– సీతారాంపురం తాసిల్దార్ కార్యాలయం పై ఏసీబీ దాడులు.
– పొలం విషయంలో 10 వేలు లంచం డిమాండ్ చేయడంతో ఏసీబీ నీ ఆశ్రయించిన అయ్యవారిపల్లి గ్రామానికి చెందిన రైతు రత్నం.
– 10 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ తాసిల్దార్ కాయల సతీష్ కుమార్.
ఏపీ హైకోర్టు
ఏపీ హైకోర్టు మరోమారు రాష్ట్ర పోలీసు శాఖ బాస్ (డీజీపీ)ని విచారణకు హాజరు కావాలంటూ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు బుధవారం జరిగిన ఓ కేసు విచారణ సందర్భంగా పోలీసు అధికారులు నిబంధనలు పాటించడం లేదన్న పిటిషన్ వాదనలతో స్పందించిన హైకోర్టు తదుపరి విచారణకు డీజీపీ హాజరు కావాలంటూ ఆదేశాలు జారీ చేసింది. పోలీసు అధికారులు నిబంధనలకు అనుగుణంగా ఎందుకు పనిచేయడం లేదన్న విషయాన్ని వివరించాలని డీజీపీని కోర్టు ఆదేశించింది.
రైస్ మిల్లర్లు, వాహనదారులను రేషన్ బియ్యం పేరుతో పోలీసు అధికారులు వేధిస్తున్నారంటూ కర్నూలుకు చెందిన సౌదామిని రైస్ మిల్లు యాజమాన్యం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. రేషన్ బియ్యం పేరిట నిత్యం తనిఖీలు చేస్తూ పోలీసులు మిల్లర్లతో పాటు వాహనదారులను వేధిస్తున్నారని ఆ సంస్థ తన పిటిషన్‌లో హైకోర్టుకు ఫిర్యాదు చేసింది. తనకు చెందిన మిల్లులో సోదాలు చేసిన పోలీసులు 5 వాహనాలను సీజ్ చేశారని, దీనిపై కేసు పెట్టిన పోలీసులు.. సదరు విషయాన్ని జిల్లా కలెక్టర్ దృష్టికే తీసుకురాలేదని తెలిపింది. ఇదంతా చూస్తుంటే పోలీసులు ఉద్దేశపూర్వకంగానే వేధింపులకు దిగుతున్నారని అర్థమవుతోందని వివరించింది.
ఈ పిటిషన్‌పై బుధవారం విచారణ చేపట్టిన హైకోర్టు.. పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. విచారణ సందర్భంగా పిటిషనర్ తరఫున వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాది రవితేజ.. పోలీసులు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారన్నారు. పోలీసుల తీరుపై జిల్లా స్థాయి అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం ఉండటం లేదని తెలిపారు. ఈ వాదనలు విన్న తర్వాత హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణకు డీజీపీ హాజరై.. పోలీసులు నిబంధనలు ఎందుకు పాటించడం లేదన్న విషయంపై వివరణ ఇవ్వాలని కోర్టు ఆదేశించింది.
విశాఖ
విశాఖలోని సీబీఐ ప్రత్యేక కోర్టుల్లోని రెండు కోర్టులు ఏపీలోని ఇతర ప్రాంతాలకు తరలనున్నాయి. ఈ మేరకు ఏపీ హైకోర్టు బుధవారం కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీకి సంబంధించి సీబీఐ కేసులన్నీ విశాఖలోని సీబీఐ కోర్టులోనే విచారణకు వస్తున్నాయి. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు చెందిన కేసులనూ విశాఖలోని సీబీఐ కోర్టే విచారిస్తోంది. ఈ క్రమంలో ఏపీ హైకోర్టు విశాఖలోని సీబీఐ కోర్టులను విజయవాడ, కర్నూలుకు తరలిస్తూ నిర్ణయం తీసుకుంది.
విశాఖలో ఒకటో అదనపు సీబీఐ కోర్టుతో పాటు రెండో అదనపు సీబీఐ కోర్టు, మూడో అదనపు సీబీఐ కోర్టులు కొనసాగుతున్నాయి. వీటిలో ఒకటో అదనపు కోర్టును విశాఖలోనే ఉంచుతూ రెండో అదనపు సీబీఐ కోర్టును కర్నూలుకు, మూడో అదనపు సీబీఐ కోర్టును విజయవాడకు తరలించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు హైకోర్టు అడ్మిన్ రిజిస్ట్రార్ విశాఖలోని ప్రిన్సిపల్ జిల్లా సెషన్స్ జడ్జీకి ఆదేశాలు జారీ చేశారు
ట్రిప్పర్ ను వెనకవైపు నుంచి ఢీ కొన్న కారు ఇద్దరు మృతి
ప్రకాశం జిల్లా :
ఒంగోలు నేషనల్ హైవే 16 కొప్పోలు ఫ్లైఓవర్ పై ముందు వెళ్తున్న ట్రిప్పర్ ను వెనకవైపు నుంచి కారు ఢీ. కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు స్పాట్లో మృతి. (మృతి చెందిన వారు పల్నాడు జిల్లా పిడుగురాళ్ల పట్టణానికి చెందిన ప్రముఖ వ్యాపారి యక్కల భాస్కరరావు బంధువులు )డ్రైవర్ తలకు బలమైన గాయాలు. 108 వాహనంలో అతన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు. వీరు చెన్నై నుంచి సత్తెనపల్లి వెళ్తున్నట్టు సమాచారం..
బ్రేకింగ్ న్యూస్
ఏసీబీ వలలో మరో విఆర్ఓ
గుంటూరు
మేడికొండూరు మండలం వరగాని గ్రామంలో ఏసీబీ సోదాలు
8000 లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన విఆర్ఓ