న్యూఢిల్లీ (సుప్రీంకోర్టు)
సుప్రీంకోర్టు విచారణలు లైవ్‌లో చూడాలా? ఈ లింక్‌పై క్లిక్ చేయండి!
సుప్రీంకోర్టు కార్యకలాపాల ప్రత్యక్ష ప్రసారం ప్రారంభమైంది.
– రాజ్యాంగ ధర్మాసనం కేసుల విచారణను యూట్యూబ్‌లో లైవ్‌లో చూసేందుకు వీలు కల్పించింది సర్వోన్నత న్యాయస్థానం.
– త్వరలోనే ఇందుకోసం సొంత వేదికను అందుబాటులోకి తీసుకురానుంది.
★ సుప్రీంకోర్టులో జరిగే కేసుల విచారణను ఇక సామాన్య పౌరులు సైతం ప్రత్యక్షంగా వీక్షించవచ్చు.
★ రోజువారీ కార్యకలాపాలను మంగళవారం నుంచి లైవ్ ద్వారా ప్రసారం చేస్తోంది సర్వోన్నత న్యాయస్థానం.
★ప్రస్తుతానికి రాజ్యాంగ ధర్మాసనం విచారించే కేసుల్ని మాత్రమే యూట్యూబ్‌లో చూసే వీలు కల్పించిన సుప్రీంకోర్టు.. త్వరలోనే ఇందుకోసం సొంత వ్యవస్థను ఏర్పాటు చేసుకోనున్నట్లు తెలిపింది.
★కేసుల విచారణను ప్రత్యక్ష ప్రసారం చేయాలని.. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ యూయూ లలిత్ నేతృత్వంలో గత మంగళవారం జరిగిన ఫుల్ కోర్ట్ సమావేశంలో నిర్ణయించారు.
★ లైవ్ ఇచ్చేందుకు న్యాయమూర్తులంతా ఏకాభిప్రాయం వ్యక్తం చేయగా.. సుప్రీంకోర్టు సిబ్బంది అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేశారు.
★https://main.sci.gov.in/display- board*లేదా https://webcast.gov.in/scindia/* లో వేర్వేరు ధర్మాసనాల విచారణల ప్రత్యక్ష ప్రసారం లింకులు అందుబాటులో ఉంటాయి._
★ ఈడబ్ల్యూఎస్ కోటా; దిల్లీ ప్రభుత్వం వర్సెస్ కేంద్రం, శివసేన వివాదం; ఆల్ ఇండియా బార్ ఎగ్జామ్ చెల్లుబాటుపై మూడు వేర్వేరు ధర్మాసనాల విచారణల్ని ఇక్కడ చూడొచ్చు.*