బిర్యానీ విషయంలో అర్థరాత్రి ఓ వ్యక్తి హోంమంత్రి మహమూద్ అలీకి ఫోన్ చేసిన ఘటన పాతబస్తీలో చోటు చేసుకుంది. పాతబస్తీలో బిర్యానీ విషయంలో ఫైట్ జరగడంతో..ఓ వ్యక్తి హోంమంత్రి మహమూద్ అలీకి కాల్ చేశాడు. పాతబస్తీలో ఎన్ని గంటల వరకు హోటళ్లు తెరిచి ఉంచాలో చెప్పాలని డిమాండ్ చేశాడు. అర్థరాత్రి ..ఫుల్ నిద్రలో ఉన్న తనకు..బిర్యానీకి సంబంధించిన కాల్ రావడంతో మహమూద్ అలీ అవాక్కయ్యారు.
హోంమంత్రి అసహనం..
గాఢనిద్రలో ఉన్న తనను డిస్ట్రబ్ చేసిందే కాకుండా..హోంమంత్రిని ఏ ప్రశ్నలు వేయాలో తెలియదా అని సదరు వ్యక్తిపై మహమూమ్ అలీ ఫైర్ అయ్యారు. తాను హోంమంత్రినని..వంద టెన్షన్లు ఉంటాయని. అర్థరాత్రి పూట ఈ బిర్యానీ పంచాయతీ ఏంటని అసహనం వ్యక్తం చేశారు. సిటీలో ఎక్కడైనా సరే..రాత్రి 11 గంటల వరకే హోటళ్లు మూసివేస్తారని చెప్పారు.
బిర్యానీ కోసం సీపీకి వినతీ పత్రం..
ఇదిలా ఉంటే పాతబస్తీలో రాత్రి 11గంటలకే హోటళ్లు మూసివేస్తామని వాటి యజమానులు అంటుండగా.. అర్ధరాత్రి వరకు తెరిచి ఉంచాలని ఎంఐఎం నేతలు పట్టుబడుతున్నారు. ఇందులో భాగంగా పాతబస్తీలో అర్ధరాత్రి వరకు బిర్యానీ విక్రయాల అనుమతివ్వాలంటూ గతంలో ఎంఐఎం నేతలు హైదరాబాద్ కమిషనర్ను కలిశారు.