DailyDose

TNI నేటి నేర వార్తలు సిఐ సస్పెన్షన్

TNI నేటి నేర వార్తలు సిఐ సస్పెన్షన్

43కోట్ల విలువైన లూటీ కేసును నీరుగార్చాడు. చివరకు సస్పెండ్ అయ్యాడు
police1

ఆయన శాంతిభద్రతల్ని కాపాడాల్సిన బాధ్యత గల పోలీసు అధికారి. దొంగలు, అవినీతిపరులు, నేరస్తుల పాలిట సింహస్వప్నంలా వ్యవహరించాల్సి ఉంటుంది. అయితే నెల్లూరుజిల్లాలో మాత్రం ఓ పోలీసు అధికారి నేరస్తుడితో చేతులు కలిపాడు. అతనిచ్చిన ఆమ్యామ్యాకు లోబడి నేరస్తుడిపై ఉన్న కేసు తీవ్రతను తగ్గించే ప్రయత్నం చేశాడు. విషయం గ్రహించిన బాధితులు పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో అతని బండారం బయటపడింది
వివరాల్లోకి వెళితే ప్రస్తుతం నెల్లూరుజిల్లా కావలి రూరల్ CI గా పనిచేస్తున్న షేక్ ఖాజావలి గతంలో కృష్ణపట్నం పోర్టు పోలీస్ స్టేషన్ CI గా పనిచేశారు. ఆ సమయంలో పోర్టులో చోరీ కేసు నమోదైంది.

ఓ సంస్థ తమకు చెందిన 43 కోట్ల రూపాయల విలువైన బొగ్గును కృష్ణపట్నం పోర్టులో ఉంచింది. దానికి ఓవ్యక్తిని కస్టోడియన్ (సంరక్షకుడు ) గా నియమించింది. కొన్ని నెలలు గడిచిన తర్వాత సంస్థకు తెలియకుండా కస్టోడియన్ గా ఉన్న వ్యక్తి 43 కోట్ల విలువైన బొగ్గును ఇతరులకు విక్రయించేశాడు. విషయం తెలుసుకున్న ఆ సంస్థ దానిపై కృష్ణపట్నం పోర్టు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. సంస్థకు చెందిన బొగ్గును సంస్థ ప్రమేయం లేకుండా మోసం చేసి కస్టోడియన్ అమ్మేశాడని ఫిర్యాదు చేయగా అప్పటి సిఐ ఖాజావలి కేసు నమోదు చేశాడు. ఈ క్రమంలో కేసులో నిందితునిగా ఉన్న కస్టోడియన్. ఖాజావలికి లంచం ఆఫర్ చేశాడు. కేసు తీవ్రతను తగ్గించి తనకు సహకరిస్తే భారీ మొత్తం లంచంగా ఇస్తానని ఆఫర్ చేయగా CI ఖాజావలి దానికి అంగీకారం తెలిపాడు. ఈ క్రమంలో కేసుతీవ్రతను తగ్గించి కేసు విచారణను త్వరితగతిన ముగించే ప్రయత్నం చేశాడు. CI పై అనుమానంతో దీనిపై బాధితులుగా ఉన్న సంస్థ ప్రతినిధులు పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదుపై గుంటూరు రేంజ్ ఐజి త్రివిక్రమ్ వర్మ విచారణకు ఆదేశించారు. ఐజి ఆదేశాలతో ఉన్నతాధికారులు విచారణ జరపగా సిఐ ఖాజావలి కేసు తీవ్రతను తగ్గించిన మాట వాస్తవమని, దానికి ప్రతిఫలంగా సిఐ ఖాజావలి 65 లక్షలు లంచంగా పుచ్చుకున్నట్లు తేలింది. నివేదికను పరిశీలించిన ఐజి త్రివిక్రమ్ వర్మ సిఐ ఖాజావలిపై అభియోగాలు రుజువు కావడంతో ఆయన్ను విధుల నుండి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

ప్రస్తుతం ఆయన కావలి రూరల్ సిఐగా పనిచేస్తున్నారు. ఖాజావలి సస్పెన్షన్ జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.

కృష్ణాజిల్లా

తక్షణమే రుణమంటూ ప్రజలను వేధింపులకు గురిచేస్తున్న కేటుగాళ్ళను అదుపులోనికి తీసుకొని దర్యాప్తు ముమ్మరం

ముద్దాయిల అరెస్టుపై విలేకరుల సమావేశం నిర్వహించి కేసు వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ శ్రీ జాషువా ఐపీఎస్ గారు

ఒక క్లిక్ తో రుణమంటూ, డాక్యుమెంట్ అవసరం లేదంటూ ప్రజలను మభ్యపరుస్తూ లోన్ ఇచ్చినట్లే ఇచ్చి,అనేక రెట్లు కట్టించుకుంటు, ఆపై నిత్య వేధింపులకు పాల్పడుతున్న లోన్ ఆప్ నిర్వాహకులపై కృష్ణా జిల్లా పోలీసు యంత్రాంగం పంజా ఝుళిపిస్తుంది. జిల్లా ఎస్పీ శ్రీ పి జాషువా ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు ఫిర్యాదు అందిన వెంటనే తక్షణమే రంగంలోకి దిగుతూ బృందాలుగా ఏర్పడి దర్యాప్తు వేగవంతం చేయడమే కాకుండా బాధితులను వేధింపులకు గురి చేస్తున్న కేటుగాళ్ళను అదుపులోనికి తీసుకునే పనిలో పడ్డారు కృష్ణా జిల్లా పోలీసు యంత్రాంగం. ఇలా లోన్ యాప్ నిర్వహిస్తున్న 5 ముద్దాయిలను అదుపులోనికి తీసుకోగా ఈ కేసుకు సంబంధించి జిల్లా పోలీస్ కార్యాలయ ఆవరణలో గల కాన్ఫరెన్స్ హాల్ నందు ఈరోజు జిల్లా ఎస్పీ శ్రీ జాషువా ఐపీఎస్ గారు విలేకరుల సమావేశం నిర్వహించి కేసు పూర్వాపరాలను తెలిపారు

ఇటీవల కాలంలో పెనమలూరు, ఆత్కురు పోలీస్ స్టేషన్ పరిధిలో లోన్ యాప్ వేధింపులకు పాల్పడుతున్న నలుగురు నిందితులను అదుపులోనికి తీసుకొని వారిని విచారించగా వారి వద్ద నుండి విలువైన సమాచారం రాబట్టారు. ఆ రాబట్టిన సమాచారం మేరకు జిల్లా ఎస్పీ గారి ఆధ్వర్యంలో అడిషనల్ ఎస్పీ శ్రీ వెంకట రామాంజనేయులు గారి స్వీయ పరివేక్షణలో బృందాలుగా ఏర్పడి సేకరించిన సమాచారం ఆధారంగా గాలింపు చర్యలు చేపట్టి దర్యాఫ్తు వేగవంతం చేశారు. సేకరించిన సమాచారానికి అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడిస్తూ నేరస్తుల కదలికలపై నిఘా పెట్టారు. అందులో భాగంగా నలుగురు ముద్దాయిలను అదుపులోనికి తీసుకున్నారు.
నేరస్తుల వివరాలు

617/2022- Penamaluru PS.

1. RAHUL SINGH S/o Hansraj SINGH.
A/324M, C/RAJPUT, Private Job, VANDANA Enclave PRAGATHI VIHAR, Khora Colony
Ghaziabad. UP state.

2. ROHIT kumar,
$/ RAMESHWAR Singh A/24, Rajuput , private Job E 14 C, Noida Sector-8 U.P Now : R.c. 136 PRAGATHI VIHAR
Khora Colony GHAZIABAD
UP. State .
వీళ్ళిద్దరూ అన్నదమ్ములు

3. JAY SANKAR UPADHYAY S/o Shri PAVAN KUMAR UPADHYAY A/25 , BRAHMIN, (panjab
KESARI Group) Reporter, Media correspondent,( Gosyaig, AYODYA (Dist), UP state.

4. Abhishek Kumar Sinha, @ Arnav Sharma s)o Pramod Kumar Sinha, a/32 yrs, c/lala, r/ E54 B, Mansaramparak, Utham Nagar, New Delhi.

వారి సమాచారం మేరకు Hyderabad కు చెందిన మరోక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు

పై ముద్దాయిల విచారణలో భాగంగా ఏర్పాటు అయిన ప్రత్యేక బృందం ఢిల్లీ నందు వారిని అదుపులోనికి తీసుకొని వారిని విచారించే క్రమంలో శుభమ్ అనే అతను ఈ కార్యకలాపాలన్నిటికీ కీలకంగా వ్యవహరిస్తు ఈ నెట్వర్క్ మొత్తాన్ని నిర్వహిస్తున్నట్లు, 4 వ ముద్దాయి అయిన అభిషేక్, శుభం యొక్క సోదరుడు నితేష్ దగ్గర పనిచేస్తున్నట్లు తెలింది. అభిషేక్ అనే అతనిని శుభమ్ బ్యాంక్ ఏటీఎం కార్డులకు కొరియర్ గా ఉపయోగించుకుంటున్నట్లు విచారణలో వెల్లడయ్యింది. పై నిందితులలో ఒకరు వాట్స్అప్, ఫోన్ కాల్స్ మరియు నకిలీ ఫోన్ నెంబర్ల ద్వారా బాధితులను బెదిరించడంలో ఒక గ్రూపు ఉండగా, మరొక గ్రూప్ సామాజిక మాధ్యమాల వేదికగా కీలక సమాచారం రాబడుతూ, వివిధ రాష్ట్రాల్లో కరెంట్ అకౌంట్లు తెరిపించే ఏజెంట్లతో సంప్రదింపులు జరుపుతూ, లోన్ తీసుకున్న బాధితుల వివరాలు సేకరించడంలో దిట్ట. వీరితోపాటు హైదరాబాద్ రాజేంద్రనగర్ కు చెందిన హక్తర్ హుస్సేన్ అనే వ్యక్తి కూడా సదురు నేరాలకు సహకరిస్తూ కరెంటు అకౌంట్ లను సమకూర్చి ముద్దాయిలకు ఇస్తున్నట్లు గుర్తించినందున తనను కూడా అదుపులోనికి తీసుకొని విచారించగా వివిధ జిల్లాలకు చెందిన వ్యక్తుల కరెంటు ఖాతాల సమాచారం సేకరించుకున్నట్లుగా తేలింది

ఈ మధ్యకాలంలో నేరస్తుల బ్యాంకు ఖాతాలను పోలీసులు గుర్తిస్తున్న కారణంగా, వారు నేరుగా బ్యాంకు ఖాతాలకు సంబంధించిన అకౌంట్ నెంబర్లను బాధితులకు పంపించకుండా, సాంకేతిక పరిజ్ఞానంతో UPI, తదితర లింకులను తయారు చేసి బాధితులకు WhatsApp ద్వారా పంపుతున్నారు. వీటిని ,bank అధికారులు, పోలీస్ అధికారులు తెలుసుకునేలోపే సదరు లింకులు నిర్వీర్యం అవుతున్నాయి. అయినప్పటికీ కృష్ణాజిల్లా సైబర్ క్రైమ్ విభాగం ఎంతో చాకచక్యంగా సదరు లింకులను Trace చేసి, బ్యాంకు ఖాతా వివరాలను సేకరించడం జరిగింది మరియు బెదిరింపు కాల్స్ చేస్తున్న VOIP Cal’s మరియు బ్యాంకు ఖాతా లింకులను ట్రేస్ చేయగా అది పాకిస్తాన్, చైనా,బంగ్లాదేశ్, నేపాల్ దేశాలలో సర్వర్లు పెట్టి విస్తృతమైన నెట్వర్క్ సహాయంతో అక్రమాలకు పాల్పడుతున్నట్లుగా కృష్ణా జిల్లా పోలీస్ శాఖ గుర్తించింది

లోన్ యాప్ నిర్వాహకులు వీరి కార్యకలాపాలన్ని ఒకే ప్రాంతం నుండి నిర్వహించకుండా లోన్ మంజూరు ఒక రాష్ట్రం నుండి అయితే, వేధింపులు మరొక రాష్ట్రం నుండి, బాధితులు చెల్లించే మొత్తం ఒక రాష్ట్ర బ్యాంక్ అకౌంట్లకు, ఈ మొత్తం చేరేది ఒక రాష్ట్రంలోని సంబంధిత వ్యక్తుల ఖాతాలకు ఇలా ఎవరికీ చిక్కకుండా దొరకకుండా, వారి ఉనికి వారిలో వారికి కూడా తెలియకుండా కార్యకలాపాలు నిర్వహిస్తూ సామాన్య ప్రజలను వేధింపులకు గురి చేస్తున్నారు. వీరందరూ కూడా ఒకరికి ఒకరికి ముఖ పరిచయం కూడా లేకుండా కేవలం వాట్సాప్, మెసెంజర్ల, టెలిగ్రామ్ బంటి వివిధ సామాజిక మాధ్యమాల ద్వారా మాత్రమే సమాచారం అందిపుచ్చుకుంటూ,2.5%,5% కమిషన్ ప్రాతిపదికన వీరి యొక్క లావాదేవీలు నిర్వహిస్తుంటారు.

ఇప్పటివరకు నమోదైన 5 కేసులలో మొత్తం 15 బ్యాంక్ అకౌంట్ ల ద్వారా పాత మరియు పై నిందితులందరూ కలిసి ఇప్పటివరకు 91,84,59,376/-రూపాయల వరకు బాధితులతో లావాదేవీలను నిర్వహించినట్లు తెలియడంతో, సంబంధిత బ్యాంకు అధికారులను సంప్రదించి ప్రస్తుతానికి 23,33,272/-రూపాయలను బ్యాంకు ఖాతాలలో నిలుపుదల చేయడం జరిగింది. ఇంకా మిగిలిన మొత్తాన్ని కూడా ఇతర శాఖలను సమన్వయపరచుకుంటూ బాధితులకు న్యాయం జరిగేలా వ్యవహరిస్తామని కృష్ణాజిల్లా పోలీస్ యంత్రాంగం ముక్తకంఠంతో తెలిపింది. ఈ కేసును చేదించడంలో ఎప్పటికప్పుడు సాంకేతిక పరమైన సమాచారాన్ని సైబర్ క్రైమ్ ఎస్ఐ దీపిక గారు అందిస్తుండగా, ఎస్పీ గారి ఆదేశాలపై ఏర్పడిన ప్రత్యేక బృందమైన స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ కోమాకుల శివాజీ గారు, ఎస్సై ఎస్ శ్రీనివాసరావు గారు సిబ్బందితో కలిసి ముద్దాయిలను వారి ప్రదేశాలకు వెళ్లి వారిని అదుపులోనికి తీసుకొని రావడం జరిగింది. ఈ కేసులో ముద్దాయిలందరినీ పెనమలూరు సిఐ గోవిందరాజు గారు వారిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించడం జరుగుతుంది.

ఎవరైనా ఈ లోన్ యాప్ ద్వారా బెదిరింపులకు గురవుతూ బాధపడుతున్నట్లయితే తక్షణమే డైల్-100, సైబర్ హెల్ప్ లైన్ నెంబర్ 1930, పోలీసు వారికి ధైర్యంగా ఫిర్యాదు చేసి, చట్ట పరిధిలో పరిష్కారం పొందవచ్చని, సాధ్యమైనంతవరకు ఈ లోన్ అప్ల జోలికి పోయి ప్రాణాలు మీదకు తెచ్చుకోకుండా ఉండటమే మేలని, కరెంట్ బ్యాంక్ అకౌంట్ లను తెరిచి ఇస్తే కమిషన్ వస్తుందని ఎవరైనా నమ్మ పలికిన, మెసేజ్ చేసిన వాటికి స్పందించకుండా ఉండటమే మంచిదని, ఆమోదయోగ్యమైన బ్యాంకుల ద్వారానే రుణం పొందాల్సిందిగా ఎస్పీ గారు తెలిపారు.

విలేకరుల సమావేశంలో స్పెషల్ బ్రాంచ్ ఇంచార్జి డిఎస్పి భరతమాతాజీ గారు, గన్నవరం డిఎస్పి విజయ పాల్ గారు, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ శివాజీ గారు, డి సి ఆర్ బి ఇన్స్పెక్టర్ రామకృష్ణ గారు, పెనమలూరు సిఐ గోవిందరాజు గారు, ఎసైలు సిబ్బంది పాల్గొన్నారు.

విజయవాడ

గొల్లపూడి వన్ సెంటర్ సాయి శేషు టవర్స్ పై ఐదవ అంతస్తు నుండి తల్లి కూతురు ఇద్దరు కిందకు దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన చోటు చేసుకుంది..

మృతురాలు కందుల మాధవి, బొప్పన సత్యవతి సంఘటనా స్థలంలోనే మృతి చెందారు..

సమాచారం అందుకున్న భవానిపురం సీఐ ఉమర్ సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు..

పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది..

మంగళగిరి పట్టణంలో మరో బంగారం వ్యాపారి టోకరా????

12 కేజీల బంగారంతో కనిపించకుండా పోయిన వ్యాపారి???

పోలీసులకు ఫిర్యాదు చేయడానికి ఆచితూచి వ్యవహరిస్తున్న బాధితులు…

వెలుగు చూస్తున్న రోజుకో మోసం…

వరుస కథనాలతో హడలిపోతున్న మంగళగిరి బంగారం వ్యాపారస్తులు…

పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది

భర్తను రోకలి బండ తో కొట్టి చంపిన భార్య

అనంతపురం జిల్లా తాడిపత్రిలో గాంధికట్ట వద్ద కుటుంబకలహాలతో భర్త షేక్ అబ్దుల్ బాష(30) ను రోకలి బండ తో కొట్టి చంపిన భార్య అయేషా. నిందితురాలు పోలీస్ స్టేషన్లో లొంగుబాటు.

11 ఏళ్ల క్రితం కబ్జాకు గురైన నటి వాణిశ్రీ స్థలం , తిరిగి అప్పగించిన తమిళనాడు సీఎం.

నకిలీ పత్రాల ద్వారా రిజిస్ట్రేషన్‌ చేసుకున్న భూములను రద్దు చేసే అధికారం తీసుకొచ్చిన స్టాలిన్


✓ అక్టోబర్‌ 1, 2023 నుంచి కార్లలో ఎయిర్‌ బ్యాగ్స్‌ తప్పనిసరి చేసిన కేంద్రప్రభుత్వం

✓ M కేటగిరి వాహనాలలో ఎయిర్‌ బ్యాగ్స్‌ తప్పనిసరి

✓ ఇకపై అన్ని కార్లలో ఆరు ఎయిర్‌ బ్యాగ్స్‌ ఉండాలని కేంద్రమంత్రి