షావోమీకి చెందిన రూ.5,551 కోట్ల ఆస్తులను జప్తు చేసిన ఈడీ
ఫెమా నిబంధనలు ఉల్లంఘించిందంటూ షావోమీపై కేసు సంస్థ కార్యాలయాలపై దాడులు చేసిన ఈడీ సోదాల్లో సంస్థకు చెందిన కీలక పత్రాల స్వాధీనం
చైనాకు చెందిన మొబైల్ ఫోన్ల తయారీ దిగ్గజం షావోమీకి శుక్రవారం భారీ షాక్ తగిలింది. షావోమీ ఫెమా నిబంధనలు ఉల్లంఘించిందంటూ ఇదివరకే కేసు నమోదు చేసిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు.. ఆ సంస్థకు చెందిన కార్యాలయాలపై శుక్రవారం దాడులు చేశారు. ఈ సోదాల్లో ఆ సంస్థకు చెందిన పలు కీలక పత్రాలను ఈడీ స్వాధీనం చేసుకుంది. ఈ పత్రాలను పరిశీలించిన అధికారులు షావోమీ టెక్నాలజీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌కు చెందిన రూ.5,551 కోట్ల ఆస్తులను జప్తు చేస్తున్నట్లు ప్రకటించింది.