బిగ్‌బాస్ రియాల్టీ షోను బ్యాన్ చేయాలని దాఖలైన పిటిషన్‌పై ఏపీ హైకోర్టు శుక్రవారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా బిగ్‌బాస్‌లో అశ్లీలత ఎక్కువగా ఉందని పిటిషనర్ తరపు న్యాయవాది శివప్రసాద్ రెడ్డి వాదనలు వినిపించారు. టీవీ షోలు ఇండియన్ ‘బ్రాడ్‌కాస్టింగ్ ఫౌండేషన్ (ఐబీఎఫ్) గైడ్‌లైన్స్ పాటించడం లేదని అన్నారు. దీనిపై స్పందించడానికి కేంద్రం తరపు న్యాయవాది సమయం కోరారు.
బిగ్‌బాస్‌లో అశ్లీలతపై ఏపీ హైకోర్టు ఘాటుగా స్పందించింది. 1970ల్లో ఎలాంటి సినిమాలు వచ్చాయో తెలుసు కదా అని తెలిపిన హైకోర్టు.. ప్రతివాదులకు నోటీసులపై తదుపరి వాయిదాలో నిర్ణయిస్తామని పేర్కొంది. విచారణను అక్టోబర్11కు వాయిదా వేసింది.
కాగా బిస్బాస్ను బ్యాన్ చేయాలంటూ ఇప్పటికే పలువురు డిమాండ్ చేస్తుండటం తెలిసిందే. ఎమ్మెల్యే రాజాసింగ్, సీపీఐ నారాయణ సైతం బిగ్‌బాస్‌పై ఫైర్ అయ్యారు. బిగ్ బాస్ రియాల్టీ షో కాదని దరిద్రపు బూతు షో అని విమర్శిస్తున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి ఈ షో చూడలేని పరిస్థితి ఉందన్నారు. ఈ షో తో సమాజానికి ఎలాంటి ఉపయోగం లేదని మండిపడుతున్నారు.