సుమ కనకాల.. ఈ పేరుకు కొత్త పరిచయాలు అవసరం లేదు. ఎన్నో దశాబ్దాలుగా తనదైన స్టైల్ లో యాంకరింగ్ చేస్తూ నవ్విస్తూ.. అలరిస్తూ ఎంటర్టైన్ చేస్తున్న బుల్లితెర యాంకర్ సినిమాల్లో చిన్నాచితక పాత్రలు చేసినా కానీ సుమకు బుల్లితెరపై వచ్చిన రెస్పెక్ట్, ఫ్యాన్ ఫాలోయింగ్ వెండితెరపై రాలేదని చెప్పాలి. కేవలం సా మాన్యులే కాదు టాలీవుడ్ బిగ్ స్టార్స్ కూడా సుమకు పిచ్చ ఫ్యాన్స్.
ఏ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ అయినా ..ఆడియో ఫంక్షన్ అయినా ..సినిమా సక్సెస్ మీట్ అయినా ..బుల్లితెర ఈవెంట్స్ అయినా సరే.. సుమ కనకాల ఉండాల్సిందే. ఎక్కడికక్కడ తన ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచేసుకుంటూ తన పేరుపై చెరగని ముద్ర వేయించుకున్న యాంకర్ సుమ త్వరలోనే సినీ ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పబోతుంది అంటూ ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో ఆమె ఫాన్స్ ఏమైంది..? ఆమె ఎందుకు దూరం కావాలనుకుంటుంది..? అంటూ మాట్లాడుకుంటున్నారు.
అoదుతున్న సమాచారం ప్రకారం ఈ మధ్యకాలంలో సుమ ఆరోగ్య, కొంచెం ట్రబుల్ ఇస్తుందట . తెర పై చలాకీగా మాట్లాడుతున్న గలగల నవ్వుతూ యాంకరింగ్ చేస్తున్న ఇన్నర్ గా ఆమె ఆరోగ్యం బాగోలేదని.. ఆమె ఆడవాళ్లకు సంబంధించిన ఓ ప్రాబ్లంతో బాధపడుతుందని సోషల్ మీడియాలో న్యూస్ వైరల్ గా మారింది. అంతేకాదు దీనికి డాక్టర్స్ ఎక్కువసేపు నిలబడకూడదని.. రెస్ట్ గా పడుకోని ఉండాలి అని హడావిడిగా టెన్షన్ పడుతూ అటు ఇటు తిరగకూడదని.. ఆమెకు చెప్పుకొచ్చారట. అలా ఆమె ఇప్పటినుంచి తన ఆరోగ్యం పై కాన్సన్ట్రేషన్ చేస్తే భవిష్యత్తులో ఈ ప్రాబ్లం కొంచెం తగ్గే అవకాశం ఉన్నట్లు డాక్టర్ చెప్పారట. ఈ కారణంగానే ఇప్పటివరకు కమిట్ అయిన షూటింగ్స్ ఈవెంట్స్ కు యాంకరింగ్ చేసి ఇక తర్వాత తన యాంకరింగ్ లైఫ్ కి గుడ్ బై చెప్పాలని డిసైడ్ అయ్యిందట. మరి ఈ వార్తలో ఎంత నిజం ఉందో సుమ నోరు విప్పితే అర్థమవుతుంది..!?