TTA ఈ సంవత్సరం బతుకమ్మ పండుగను అక్టోబర్ 1వ తేదీన పవిత్రమైన నవరాత్రి సీజన్‌లో పాలటైన్, చికాగో లోని ఫాల్కన్ పార్క్ రిక్రియేషన్ సెంటర్‌లో జరుపుకుంది. ఈ కార్యక్రమంలో తెలంగాణ, ఆంధ్రా ప్రాంతాలకు చెందిన దాదాపు 500 మందికి పైగా తెలుగువారు పాల్గొన్నారు. బతుకమ్మ అనేది పూల పండుగ, బతుకమ్మ దేవతను సూచించే మట్టితో చేసిన చిన్న దేవాలయం చుట్టూ 7 పొరలలో పువ్వులు అమర్చబడి ఉంటాయి. మంచి ఆరోగ్యం మరియు సంతోషం కోసం బతుకమ్మ ని స్తుతిస్తూ వివిధ జానపద పాటలు పాడుతూ మరియు నృత్యం చేస్తూ మహిళలు ఈ పూల ఏర్పాట్ల చుట్టూ ఆడుతూ తిరుగుతారు. వచ్చిన అందరు ఉత్సవాలను పూర్తిగా ఆస్వాదించారు మరియు ఈవెంట్ ముగింపులో బతుకమ్మ ఆశీర్వాదం పొందారు. ఈ కార్యక్రమానికి రుచికరమైన బోజనాలని ఏర్పాటు చేసారు.
ఈ బతుకమ్మ పండుగను TTA ప్రెసిడెంట్ హేమచంద్ర వీరపల్లి బ్రహ్మాండంగా నిర్వహించారు. TTA సభ్యులు రామకృష్ణ కొర్రపోలు, హేమంత్ పప్పు, శ్రీనాధ్ వాసిరెడ్డి, ప్రసాద్ మరువాడ, దిలీప్ రాయపూడి, మధు ఆరంబాకం సహాయ సహకారాలు అందిచారు. ఈ కార్యక్రమము విజయవంతంగా జరగడానికి సోమలత, శృతి, శిల్ప, రమేష్, రామాదేవి, రాధికా, సందీప్, లీల ప్రసాద్, నవీన్ కుమార్ ఎంతగానో శ్రమించారు. అలాగే TANA మరియు IAGC సభ్యులు కూడా పాల్గొన్నారు.