తెలంగాణ పీపుల్స్ అసోసియేషన్ ఆఫ్ డాలస్(TPAD) ఆధ్వర్యంలో ఫ్రిస్కోలోని డా.పెప్పర్ ఎరీనాలో నిర్వహించిన బతుకమ్మ దసరా వేడుకలకు 15వేల మంది ప్రవాసులు హాజరయి విజయవంతం చేశారు. డాలస్ పరిసర ప్రాంత ప్రవాసులతో పాటు పొరుగు రాష్ట్రాలైన ఓక్లహామా, కాన్సాస్, ఆర్కాన్సా నుండి ప్రవాసులు ఈ వేడుకల్లో ఉల్లాసంగా పాల్గొన్నారు. శనివారం మధ్యాహ్నం 12 గంటలకు స్థానిక డ్యాన్స్ స్కూల్స్ విద్యార్థుల నృత్యాలతో వేడుక మొదలయింది. సాంస్కృతిక కార్యక్రమాల అనంతరం బతుకమ్మ వేడుకలు మొదలయ్యాయి. సినీనటి రీతూవర్మ సందడి చేశారు. అనంతరం విజయదశమి వేడుకలను నిర్వహించారు. శమీపూజ చేశారు. అలయ్ బలయ్ తీసుకుని సొంతగడ్డపై పండుగ చేసుకున్న ఆనందాన్ని పంచుకున్నారు.
ప్రముఖ సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్ బృందం తమ పాటలు, సంగీతంతో అలరించారు. గాయకులు లిప్సికా, రోల్ లైడా, ధనుంజయ్ తదితరులు తమ పాటలతో ఉర్రూతలూగించారు. టీపాడ్ ఫౌండేషన్ కమిటీ చైర్ అజయ్ రెడ్డి, రఘువీర్ బండారు, జానకి రామ్ మందాడి , రావుకల్వల, అధ్యక్షుడు రమణ లష్కర్, బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ చైర్ ఇంద్రాణి పంచెర్పుల, కోఆర్డినేటర్ పాండు పాల్వాయి, పవన్ గంగాధర, అశోక్ కొండాల,రామ్ అన్నాడీ,గోలి బూచి రెడ్డి, సుధాకర్ కలసాని, ఎగ్జిక్యూటివ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ రవికాంత్ రెడ్డి మామిడి,లక్ష్మి పోరెడ్డి, మాధవి లోకిరెడ్డి, మాధవి సుంకిరెడ్డి, రత్న ఉప్పల , శ్రీనివాస్ అన్నమనేని, శ్రీధర్ వేముల, మధుమతి వైశ్యరాజు , అనురాధ మేకల, మంజుల తొడుపునూరి,లింగ రెడ్డి ఆళ్వా , స్వప్న తుమ్మపాల , రేణుక చనుమోలు , గాయత్రి గిరి, శంకర్ పరిమల్, అడ్విసోర్స్ వేణు భాగ్యనగర్ , నరేష్ సుంకిరెడ్డి, కరణ్ పోరెడ్డి, రూప కన్నయ్యగారి, రోజా ఆడెపు,సతీష్ నాగిళ్ల, చంద్ర పోలీస్, శ్రీనివాస్ వేముల ఏర్పాట్లను సమన్వయపరిచారు. డాక్టర్ ప్రేమ్ రెడ్డి, నాటా అధ్యక్షుడు శ్రీధర్ రెడ్డి కొర్సపాటి సహాయ సహకారాలు అందించారు.
15వేల మందితో కిక్కిరిసిన TPAD బతుకమ్మ-దసరా వేడుకలు
Related tags :